బెంగళూరు: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ‘బి’ జట్టు 116 ఓవర్లలో 321 పరుగులకు ఆలౌటైంది. ముషీర్ ఖాన్ (373 బంతుల్లో 181; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరిన్ని పరుగులు జోడించగా...పేసర్ నవ్‌దీప్ సైనీ (144 బంతుల్లో 56;8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకంతో సత్తా చాటాడు.
చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో ఈ ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు 205 పరుగులు జోడించి భారత్ ‘బి’ని గట్టెక్కించారు. డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన ముషీర్ ఖాన్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు.
ఆ తర్వాత భారత్ ‘బి’ ఇన్నింగ్స్ ఎక్కువసేపు సాగలేదు. భారత్ ‘ఎ’ జట్టు బౌలర్లలో ఆకాశ్ దీప్ 4, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ‘ఎ’ జట్టు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది.
కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (25), మయాంక్ అగర్వాల్ (36; 8 ఫోర్లు) ఔట్ కాగా.. రియాన్ పరాగ్ (27 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (23) క్రీజులో ఉన్నారు. ఈ రెండు వికెట్లూ నవదీప్ సైనీకే దక్కాయి. చేతిలో 8 వికెట్లు ఉన్న భారత్ ‘ఎ’ జట్టు... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 187 పరుగులు వెనుకబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment