కీలకమైన ఆస్ట్రేలియాతో పోరుకు టీమిండియా సిద్ధమైంది. బలమైన బ్యాటింగ్, బుల్లెట్‌లాంటి బౌలింగ్ దళంతో బరిలోకి దిగేందుకు ఆతృతగా ఎదురుచూస్తోంది. అయితే ఇటీవల పునరాగమనం చేసిన భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై అందరి దృషి ఉంది. అతన్ని ఎదుర్కోవడం ఎంత కష్టమో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో కీలకమైన ఆసీస్‌తో పోరుకు ముందు ఇండియన్ పేసర్లు బూమ్రా, నవదీప్ సైనీ బౌలింగ్‌కు మరింత పదును పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఆసీస్ ఆటగాళ్లను బోల్తా కొట్టించేందుకు పదునైన అస్త్రాలు సిద్ధంచేస్తున్నారు. వికెట్ల ముందు షు పెట్టి నెట్స్‌లో యార్కర్లు సాధన చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ఇదికాస్తా వైరల్‌గా మారింది. (అసలు సమరానికి సై)
ప్రత్యర్థికి హెచ్చరికలుగా.. బూమ్రా బుల్లెట్లు వస్తున్నాయాంటూ క్రికెట్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లను ఈ ద్వయం ఏ మేరకు కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మూడు వన్డేల సిరీస్‌లో నేడు వాంఖడే మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్న విషయం తెలిసిందే. ఇరు జట్లు కూడా పూర్తి స్థాయి బలగంతో బరిలోకి దిగుతుండటంతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment