శ్రీలంక పర్యటనకు భారత జట్టును గురువారం బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 18 (గురువారం) సాయంత్రం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వర్చువల్‌గా సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో భారత కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం పాల్గోనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లలో తలపడనుంది.
ఈ రెండు సిరీస్‌లకు వేర్వేరు జట్లను అగార్కర్ అండ్ కో ఎంపికచేయనున్నారు. అయితే లంకతో వన్డేలకు టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి . తొలుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ హిట్‌మ్యాన్ తన నిర్ణయాన్ని మార్చుకుని శ్రీలంక పర్యటనకు అందుబాటులో ఉంటానని సెలక్టర్లకు తెలియజేసినట్లు వినికిడి. అదేవిధంగా శ్రీలంకతో టీ20ల్లో భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నవ్‌దీప్ సైనీ రీ ఎంట్రీ
శ్రీలంక టూర్‌కు భారత జట్టు ఎంపిక ముందు కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత మూడేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనీకి తిరిగి పిలుపునివ్వాలని సెలక్టర్లకు గంభీర్ సూచించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. లంకతో వన్డే జట్టులో సైనీ భాగం చేయాలని గంభీర్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్‌ను పెంచుకునే విధంగా గంభీర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నవ్‌దీప్ సైనీ చివరగా 2021లో ఆర్. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత తరపున ఆడాడు. ఆ తర్వాత అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. అతడు ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అదే విధంగా ఇటీవల దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో కూడా అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే అతడికి పిలుపునివ్వాలని గంభీర్ నిర్ణయించుకున్నట్లు వినికిడి.
Comments
Please login to add a commentAdd a comment