ఆక్లాండ్: భారత్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో 22 పరుగులతో గెలిచిన కివీస్ మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (79), రాస్ టేలర్ (73 నాటౌట్) అర్ధసెంచరీలు సాధించారు. అనంతరం భారత్ 48.3 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా ( 55), శ్రేయస్ అయ్యర్ (52;, నవదీప్ సైనీ (45) రాణించినా జట్టును మాత్రం గట్టెక్కించలేకపోయారు.భారత ఇన్నింగ్స్‌లో జడేజా-సైనీలు ఆడుతున్నంతసేపు టీమిండియా అభిమానులు మ్యాచ్‌పై గెలుపు ఆశలు పెంచుకున్నారు. ఈ జోడి మంచి బంతుల్ని సమర్ధవంతంగా ఎదుర్కోగా, చెడ్డ బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ మ్యాచ్‌పై ఆశలు రేకెత్తించింది. అసలు ఎంతమాత్రం ఊహించని సైనీ 5 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాదు.. అవసరమైన సందర్భాల్లో బ్యాట్ ఝుళిపిస్తాడనే భావన కల్గింది. మ్యాచ్ తర్వాత సైనీ మాట్లాడుతూ.. తాను కడవరకూ క్రీజ్‌లో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటున్నాడు.
‘ నేను ఔట్ కాకుండా ఉంటే ఫలితం కచ్చితంగా మరోలా ఉండేది. జడేజాతో పాటు నేను కూడా కడవరకూ ఉంటే మ్యాచ్‌ను ముగించే వాళ్లం. వికెట్ చాలా ఫ్లాట్‌గా ఉంది. దాంతో బంతి బ్యాట్‌పైకి బాగా వస్తుంది. టాపార్డర్ స్వింగ్‌కు పెవిలియన్ చేరితే, మిడిల్ ఆర్డర్ అనవసరమైన షాట్లతో వికెట్లను సమర్పించుకుంది. 113 బంతుల్లో 121 పరుగులు కొట్టాల్సిన సందర్భంలో చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో 76 పరుగులు చేశాం. సైనీ బ్యాట్‌తో మెరుస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. నేను బ్యాటింగ్ చేయగలనని ఎవరూ వినికూడా ఉండరు. అయితే టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్టు రఘు నాలోని బ్యాటింగ్ స్కిల్స్‌ను గుర్తించాడు. నువ్వు బ్యాటింగ్ కూడా చేయగలవని పదే పదే అంటుండేవారు. (ఇక్కడ చదవండి: మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా... )
రఘు మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. హోటళ్ల రూమ్‌లో కూడా నా బ్యాటింగ్ కోసం మాట్లాడేవారు. అదే నన్ను బ్యాటింగ్ చేయడానికి దోహం చేసింది. కివీస్‌తో రెండో వన్డేలో నేను బ్యాటింగ్‌కు వెళ్లే సమయానికి చాలా పరుగులు చేయాలి. మ్యాచ్‌ను కడవరకూ తీసుకెళ్లాలని జడేజా నాతో అన్నాడు. అక్కడ వరకూ వెళితే గెలిచే అవకాశం ఉంటుందని అనుకున్నాం. ఒకవేళ బౌండరీ కొట్టాల్సిన బంతి అయితే హిట్ చేయమని జడేజా నాతో చెప్పాడు. ప్రధానంగా సింగిల్స్-డబుల్స్‌పై దృష్టి పెట్టాం. అలా స్టైక్ రొటేట్ చేశాం. నేను బంతిని ఫోర్ కొట్టిన తర్వాత కాస్త ఆశ్చర్యానికి లోనయ్యా. బ్యాట్‌పైకి బంతి బాగా రావడంతో సులువుగా షాట్లు ఆడా. కాకపోతే నేను ఔట్ కావడం చాలా బాధించింది. మ్యాచ్ అయిన తర్వాత వీడియో చూసి చాలా ఫీలయ్యా. నేను ఔట్ కాకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. కీలక సమయంలో ఔట్ కావడం నిరుత్సాహానికి గురి చేసింది’ అని సైనీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment