‘అలాంటి భారత బౌలర్‌ని చూడలేదు’ | Dont See Many Who Bowl At 150 Kmph Klusener On Saini | Sakshi
Sakshi News home page

‘అలాంటి భారత బౌలర్‌ని చూడలేదు’

Published Tue, Sep 17 2019 3:43 PM | Last Updated on Tue, Sep 17 2019 3:55 PM

Dont See Many Who Bowl At 150 Kmph Klusener On Saini - Sakshi

మొహాలీ:  టీమిండియా యువ పేసర్‌ నవదీప్‌ షైనీపై దక్షిణాఫ్రికా అసిస్టెంట్‌ బ్యాటింగ్‌ కోచ్‌ లాన్స్‌ క్లూసెనర్‌ ప్రశంసలు కురిపించాడు. భారత్‌ జట్టుకు అతను భవిష్య ఆశాకిరణమని కొనియాడాడు. ప్రధానంగా షైనీ 150 కి.మీ వేగంతో బంతులు వేయడాన్ని ప్రస్తావించిన క్లూసెసర్‌.. ఈ తరహా వేగంతో బౌలింగ్‌ చేసే భారత బౌలర్‌ని ఎన్నడూ చూడలేదన్నాడు. గతంలో డీడీసీఏతో కలిసి పని చేసిన క్లూసెనర్‌.. ఢిల్లీ బౌలర్‌ అయిన షైనీ ప్రతిభను ఎప్పుడో గుర్తించిన్టుల పేర్కొన్నాడు. దాంతో ప్రస్తుతం షైనీ బౌలింగ్‌ ఏమీ తనను ఆశ్చర్యానికి గురి చేయడం లేదని క్లూసెనర్‌ చెప్పుకొచ్చాడు.

‘నాకు తెలిసి షైనీది ఒక అద్భుతమైన బౌలింగ్‌ యాక్షన్‌.  అతని యాక్షన్‌ చాలా క్లియర్‌గా ఉంటుంది. దాంతో వేగవంతమైన బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌ అ‍య్యాడు.  నేను అతనితో ఎప్పుడు మాట్లాడినా ఫాస్టెస్ట్‌ బౌలింగ్‌కే మొగ్గుచూపేవాడు’ అని క్లూసెనర్‌ పేర్కొన్నాడు.వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన షైనీ ఆకట్టుకున్నాడు. దాంతో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సైతం షైనీని ఎంపిక చేశారు. కాకపోతే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు మాత్రం షైనీకి చోటు దక్కలేదు. దీనిపై షైనీ మాట్లాడుతూ.. ‘ టెస్టు ఫార్మాట్‌లో మా బౌలింగ్‌ యూనిట్‌  చాలా బలంగా ఉంది. వెస్టిండీస్‌తో సిరీస్‌ జరిగినప్పుడు ఈ విషయాన్ని నేను గమనించా. నాకు టెస్టు జట్టులో చోటు దక్కాలంటే మరింత శ్రమించాల్సి ఉంది. అప్పుడే నాకు అవకాశం వస్తుంది’ అని షైనీ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement