శభాష్‌ సైనీ.. తలకు దెబ్బ తగిలిన క్యాచ్‌ వదలలేదు.. వీడియో వైరల్‌ | Navdeep Saini falls on his head after taking Ishan Kishan | Sakshi
Sakshi News home page

IPL 2022: శభాష్‌ సైనీ.. తలకు దెబ్బ తగిలిన క్యాచ్‌ వదలలేదు.. వీడియో వైరల్‌

Published Sat, Apr 2 2022 9:24 PM | Last Updated on Sat, Apr 2 2022 9:24 PM

Navdeep Saini falls on his head after taking Ishan Kishan - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు నవదీప్ సైనీ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌ వేసిన ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో.. కిషన్‌ డిప్‌ స్వేర్‌ లెగ్‌ దిశగా పుల్ షాట్‌ ఆడాడు. ఈ కమ్రంలో స్వేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సైనీ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. అయితే క్యాచ్‌ పట్టే సమయంలో అతడి తలకు గాయమైంది.

అయినప్పటికీ సైనీ క్యాచ్‌ విడిచి పెట్టలేదు. కాగా నొప్పితో ఫీల్డ్‌లో కొద్ది సేపు బాధ పడ్డాడు. అయితే ఫిజియో వచ్చి పరిశీలించగా గాయం అంత తీవ్రమైనది కాదని తెలింది. దీంతో ఫీల్డ్‌లో సైనీ కొనసాగాడు. కాగా ముంబై ఇన్నింగ్స్‌ అఖరి ఓవర్‌ వేసిన సైనీ కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో3 ఓవర్‌లు వేసిన సైనీ.. 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్‌ పై రాజస్తాన్‌ రాయల్స్‌ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఇక 194 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో తిలక్‌ వర్మ(61), ఇషాన్‌ కిషన్‌(54) పరగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు.

చదవండి: Tilak Varma: మ్యాచ్‌ ఓడినా మనసులు గెలుచుకున్న తెలుగు కుర్రాడు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement