
బెంగళూరు: మైదానంలో సహచర ఆటగాళ్లపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అసహనం ప్రదర్శించిన సందర్భాలు చాలానే ఉంటాయి. అయితే రోహిత్ శర్మ ఇందుకు కాస్త భిన్నంగానే ఉంటాడు. ఒకవేళ ఏ ఆటగాడికైనా చెప్పాలకున్నా కూల్‌నే విషయాన్ని చేరవేస్తాడు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో రోహిత్ టెంపర్‌ను కోల్పోయాడు. విరాట్ కోహ్లి ఫీల్డ్‌ను విడిచి వెళ్లిన సమయంలో రోహిత్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టాడు. ఈ తరుణంలో యువ పేసర్ నవదీప్ సైనీ వేసిన ఒక ఓవర్ రోహిత్‌కు కోపం తెప్పించింది.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భాగంగా 12వ ఓవర్ ఐదో బంతిని సైనీ లెగ్ స్టంప్‌పైకి ఫుల్‌టాస్ వేశాడు. దానికి క్రీజ్‌లో ఉన్న బావుమా ఫోర్‌తో సమాధానమిచ్చాడు. అంతకుముందు బంతిని కూడా బావుమా ఎక్స్‌ట్రా కవర్ మీదుగా ఫోర్‌గా కొట్టడంతో చిర్రెత్తుకొచ్చిన రోహిత్.. కాస్త బుర్ర పెట్టి బౌలింగ్ చేయమంటూ సైనీకి సైగలు చేశాడు. ఆ సమయంలో బావుమాకు జతగా కెప్టెన్ డీకాక్ క్రీజ్‌లో ఉన్నాడు. ఇలా సైనీపై రోహిత్ అసహనం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో భారత్ 9వికెట్ల తేడాతో పరాజయం చెందింది. సైనీ రెండు ఓవర్లు వేసి వికెట్ సాధించకపోగా 25 పరుగులిచ్చాడు.