
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా సారథి విరాట్ కోహ్లి కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు. కీలక సమయంలో ప్రమాదకరంగా మారుతున్న బ్యాట్స్‌మన్‌ను తన సూపర్బ్ క్యాచ్ ఔట్ చేశాడు. ఇది టీమిండియాకు టర్నింగ్ పాయింట్ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. హాఫ్ సెంచరీతో అదరగొడుతున్న డికాక్ నవదీప్ సైనీ వేసిన 12 ఓవర్ రెండో బంతిన స్ట్రేట్ డ్రైవ్ ఆడాడు. అది కాస్తా గాల్లోకి లేవడంతో మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి చిరుతలా పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో డికాక్ షాక్ గురై భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. టీమిండియా ఆటగాళ్లతో సహా అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు.
అప్పటివరకు సాఫీగా సాగుతున్న సఫారీ ఇన్నింగ్స్ కోహ్లి క్యాచ్‌తో కకలావికలం అయింది. డికాక్‌తో పాటు బవుమా రాణిస్తుండటంతో సఫారీ జట్టు భారీ స్కోర్ సాధిస్తుందనుకున్నారు. అయితే డికాక్ ఔటైన తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ తడబడటంతో టీమిండియా ముందు ఓ మోస్తారు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ప్రస్తుతం కోహ్లి అందుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నెటిజన్లు కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment