దేశం ఏదైనా వేదన ఒక్కటే | Indians Sharing Their Struggles From Other Countries In Family | Sakshi
Sakshi News home page

దేశం ఏదైనా వేదన ఒక్కటే

Published Fri, Apr 3 2020 3:28 AM | Last Updated on Fri, Apr 3 2020 3:28 AM

Indians Sharing Their Struggles From Other Countries In Family - Sakshi

మానవ నాగరికతలో బండి చక్రం కనుగొనడం గొప్ప ఆవిష్కరణ అంటారు. చక్రం మనిషిలో కదలిక తెచ్చింది.  వలస వేగవంతం చేసింది. ఉన్న చోటనే ఉండటం మనిషి చరిత్రలో లేదు. అందుకే ప్రపంచంలోని ప్రతి దేశం మనిషికి ఆవాసం అయ్యింది. తెలుగువారు ప్రతి దేశంలో ఉన్నారు. మూలాలు ఉన్న రెండు రాష్ట్రాల్లో పెద్దలను వదిలిపెట్టి వెళ్లారు. తల్లిదండ్రులు ఇక్కడ... పిల్లలు ఎక్కడో. అంతా బాగుండే వాతావరణం కరోనాతో అతలాకుతలమైంది. ఒకరి మేలు ఒకరు కోరుకోవడమే ఇప్పుడు మిగిలింది. ఎప్పుడు కలుస్తామో... ఎన్నాళ్లకు కలుస్తామో. 

గతంలో అంతా హుషారుగా ఉండేది. ఉత్సాహంతో ఫోన్లు మోగేవి. ‘ఈ వీకెండ్‌కి ఏంటి ప్లాన్‌?’, ‘నాన్నా.. నా ఫ్రెండ్‌ ఇండియా వస్తున్నాడు.. మోకాళ్ల నొప్పుల టాబ్లెట్స్‌ పంపిస్తున్నాను.. ఇంకేమైనా కావాలా?’, ‘ఒరేయ్‌.. భాస్కర్‌ అంకుల్‌ వాళ్లు వస్తున్నారు.. వాళ్లతో పచ్చళ్లు, చింతపండు, కారం పంపించనా?’, ‘షఫీల్డ్‌ నుంచి లండన్‌ షిఫ్ట్‌ అవుతున్నారట.. న్యూ ఆపర్చునిటీ ఏదైనా వచ్చిందా?’, ‘ఆన్‌సైట్‌ మీద స్విట్జర్లాండ్‌ వెళ్తున్నానే.. అట్లాంటాలో ఇల్లు లీజ్‌కు ఇద్దామనుకుంటున్నా.. ఇండియన్స్‌ ఎవరన్నా ఉంటే చూస్తావా?’ ఇలాంటి సంభాషణలు ఇప్పుడు లేవు. ఇండియా నుంచి ప్రపంచంలోని ఏ దేశానికి ఫోన్‌ చేసినా ప్రపంచంలోని ఇంకే దేశం నుంచి ఇండియాకు ఫోన్‌కాల్‌ వచ్చినా ఒకటే మాట.. పదే పదే.. ‘జాగ్రత్త.. బయటకు వెళ్లకండి’ అనే. కరోనా వైరస్‌ మూలంగా ప్రపంచమంతా దాదాపుగా షట్‌డౌన్‌ అయింది. ఉన్న చోటు నుంచే ఎక్కడో ఉన్న తమlవారి క్షేమ సమాచారాన్ని వింటూ.. కోరుకుంటూ  కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిగో.. గల్ఫ్‌ మీదుగా యూరప్‌ను పలకరిస్తూ అమెరికాలోనూ ఆరా తీసి కెనడాను కుశల ప్రశ్నలు అడిగి.. ఆ అభిప్రాయాలను ఇలా షేర్‌ చేస్తున్నాం ఇక్కడ.

చైనీస్‌ స్ట్రీట్‌ వైపు వెళ్లట్లేదు
నేను కెనడాలో ఉంటాను. టొరొంటోలో. మా అక్కయ్య అమెరికాలో స్థిరపడింది. అమ్మా నాన్న హైదరాబాద్‌లో ఉంటారు. మా అక్కయ్య ఇండియా వచ్చిన కొన్ని రోజులకే ఈ కరోనా గొడవ మొదలయ్యే సరికి మొన్న ఫిబ్రవరి సెవెన్త్‌కే అమెరికా బయలుదేరిపోయింది. ఈ విషయం తెలిసిన హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు హైదరాబాద్‌లో మా ఇంటికి  ‘దిస్‌ హోమ్‌ ఈజ్‌ అండర్‌ క్వారంటైన్‌’ అని స్లిప్‌ అతికించారట. ఫిఫ్టీన్‌ డేస్‌లో నాలుగుసార్లు హోమ్‌ విజిట్‌ కూడా చేశారని మా పేరెంట్స్‌ చెప్పారు ఫోన్‌లో. సేఫ్టీమెజర్స్‌ బాగానే తీసుకుంటున్నారని హ్యాపీగా అనిపించింది అది విన్నాక . ఇక్కడ ఇండియన్స్‌మి జాగ్రత్తగానే ఉంటున్నాం. మా పక్కనే చైనీస్, కొరియన్స్‌ ఉండే స్ట్రీట్‌ ఉంటుంది ‘యంగ్‌స్ట్రీట్‌’ అని. దాని వైపే వెళ్లట్లేదెవ్వరం. – ఎడ్ల పవన్‌ రెడ్డి, ఐటీ ఉద్యోగి, కెనడా

జాలిగా చూస్తున్నారట
మా సొంతూరు విజయవాడ. మా అమ్మా నాన్నకు ఒక్కదాన్నే కూతుర్ని. పెళ్లయ్యాక, భర్తతో అమెరికా వచ్చేశాను. మాకు ముగ్గురు పిల్లలు. మొన్నటి దాకా అంతా బాగానే ఉంది. అంతకుముందు ‘మీ అమ్మాయి అమెరికాలో ఉంటోందా?’ అంటూ మా పేరెంట్స్‌ని అబ్బురంగా చూసినవాళ్లే ‘పాపం వీళ్ల అమ్మాయి అమెరికాలో ఉంటోంది’ అని జాలిగా అంటున్నారట. మా పేరెంట్స్‌ ఇద్దరూ 60 ఏళ్లు దాటినవాళ్లే. నిజానికి ఈ ఏప్రిల్లో వాళ్లు అమెరికా రావడానికి టికెట్‌ కూడా కన్‌ఫర్మ్‌ అయింది. ఇదిగో కరోనా వల్ల అది క్యాన్సిల్‌ అయిపోయింది. వాళ్లూ నా దగ్గరే ఉంటే అందరం ఒక్కచోటే ఉన్నామన్న నిశ్చింత ఉండేది. 
– కేజియా ముప్పిడి, కాంట్రాక్ట్‌ ఎంప్లాయి, వాషింగ్‌టన్‌ డీసీ

ఫ్యామిలీ అక్కడ.. నేనిక్కడ
ఆన్‌సైట్‌ మీద ఆస్ట్రేలియా వచ్చాను. సిక్స్‌ మంత్స్‌ అవుతోంది. నా వైఫ్‌ ప్రెగ్నెంట్‌. వచ్చే నెల తనకు డ్యూ డేట్‌. నేను హైదరాబాద్‌ వెళ్లాల్సింది. కరోనా వల్ల నో చాన్స్‌. ఆమె ఇప్పుడు వాళ్ల అమ్మవాళ్ల ఊరు పులివెందులలో ఉంది. మా పేరెంట్సేమో హైదరాబాద్‌లో. నేనిక్కడ. ఎంత టెన్షన్‌గా ఉందో. ఒక్క ఊరట ఏంటంటే.. ఇండియాలో లాక్‌డౌన్‌ చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతోందని. ఇక్కడ లాక్‌డౌన్‌ అంత పర్‌ఫెక్ట్‌గా లేదు. గ్రాసరీస్, రెస్టారెంట్స్‌ అన్నీ తెరిచే ఉన్నాయి. సోషల్‌ డిస్టెన్సింగ్‌ మెయిన్‌టైన్‌ చేస్తున్నారంతే. – రవి కిషన్, ఐటీ ఎంప్లాయి, సిడ్నీ

నిజమెంతో తెలియదు
మిగతా దేశాలు ఈ ఔట్‌బ్రేక్స్‌ని తట్టుకోవడానికి హాస్పిటల్స్‌ కడ్తుంటే బ్రిటన్‌లో మాత్రం శ్మశానాలు ఏర్పాటు చేస్తున్నారన్న విషయం మమ్మల్ని చాలా భయపెడ్తోంది.  వైరస్‌ ఎఫెక్ట్‌ మైల్డ్‌గా ఉన్నవాళ్లు హాస్పిటల్స్‌కు రాకూడదు ఇంట్లోనే ఉండాలి అని ఒక ప్రచారం వైరల్‌ అవుతోందిక్కడ. ఈ క్రైసిస్‌లో ఇండియన్స్‌ అంతా కలిసి మెలిసి ఉంటున్నాం. రెంట్‌ కట్టుకోలేని స్టూడెంట్స్‌కి ఇంటిని షేర్‌ చేస్తున్న తెలుగు కుటుంబాలూ ఉన్నాయి. ఇలాంటివి తెలిసినప్పుడు భరోసాగా అనిపిస్తోంది. ఇండియాలో ఉన్న పేరెంట్స్‌ గుర్తొచ్చినప్పుడు మాత్రం దిగులుగా అనిపిస్తోంది. – సి.రమోల, సాఫ్ట్‌వేర్, లండన్‌

ధైర్యం చెప్పుకుంటున్నాం
మా అమ్మాయి కాలిఫోర్నియాలో ఉంటుంది. ఆమె దగ్గరకి వచ్చి ఇక్కడే చిక్కుకున్నాను కరోనా వల్ల. మా ఆయనేమో మా సొంతూరు నిజామాబాద్‌లో ఉన్నారు. మొన్న 23వ తేదీ మా 50వ పెళ్లిరోజు. అప్పటికల్లా ఇండియా వెళ్లిపోవాలని టికెట్‌ బుక్‌ చేసుకున్నాను. ఫ్లయిట్స్‌ అన్నీ క్యాన్సల్‌ అయి.. నేనిక్కడ.. కేక్‌ కట్‌ చేస్తూ వీడియో కాల్‌లో విషెస్‌ చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటున్నాం. 
– పొట్లూరి ఛాయాదేవి, రిటైర్డ్‌ టీచర్, కాలిఫోర్నియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement