వారెవ్వా శామ్సన్‌.. వాట్‌ ఏ ఫీల్డింగ్‌ | Terrific Fielding Effort By Sanju Samson In 3rd T20 | Sakshi
Sakshi News home page

వారెవ్వా శామ్సన్‌.. వాట్‌ ఏ ఫీల్డింగ్‌

Published Tue, Dec 8 2020 3:06 PM | Last Updated on Tue, Dec 8 2020 4:08 PM

Terrific Fielding Effort By Sanju Samson In 3rd T20 - Sakshi

సిడ్నీ : ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో సంజూ శామ్సన్‌ అద్భుతమైన ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 13వ ఓవర్లో మాథ్యూ వేడ్‌ భారీ షాట్‌ ఆడాడు. దాన్ని అందరూ సిక్స్‌గానే భావించారు. కానీ బౌండరీ లైన్‌ వద్ద  అప్పటికే కాచుకు కూర్చున్న శామ్సన్‌ దాదాపు అందుకున్నంత ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే బౌండరీ లైన్‌ను దాటేయడంతో బంతిని నెట్టేశాడు. దీంతో సిక్స్‌ రావాల్సిన చోట కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఒకవేళ శామ్సన్‌ ఈ క్యాచ్‌ పట్టి ఉంటే మాత్రం అద్బుత క్యాచ్‌గా మిగిలిపోయేది. ఇప్పటివరకు ఆసీస్‌ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 145  పరుగులు చేసింది. ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ 73 పరుగులు, మ్యాక్స్‌వెల్‌ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement