పూల‌ జాత‌ర‌తో ప‌ర‌వ‌శించిన సిడ్నీ నగరం | Bathukamma Celebrations In Sydney City | Sakshi
Sakshi News home page

పూల‌ జాత‌ర‌తో ప‌ర‌వ‌శించిన సిడ్నీ నగరం

Published Sat, Oct 5 2019 9:30 PM | Last Updated on Sat, Oct 5 2019 9:31 PM

Bathukamma Celebrations In Sydney City - Sakshi

సిడ్నీ బతుకమ్మ, దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (ఎస్‌బీడీఎఫ్‌) మరియు ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ఏటీఎఫ్‌)ఆధ్వర్యంలో  బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.  సిడ్నీ దుర్గా ఆలయం ఆడిటోరియంలో నిర్వయించిన బ‌తుక‌మ్మ ఆట పాటతో సిడ్నీ నగరం పూల‌జాత‌ర‌తో ప‌ర‌వ‌శిచింది. బతుక‌మ్మ ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. స‌ప్త‌వ‌ర్ణాల శోభిత‌మైన పూల‌దొంత‌ర‌ల బ‌తుక‌మ్మ‌లు చూడ‌ముచ్చ‌టేశాయి. ఉత్త‌మ బ‌తుక‌మ్మ‌ల‌ను నిర్వాహ‌కులు ఎంపిక చేసి.. వాటిని త‌యారు చేసిన మ‌హిళ‌ల‌కు బ‌హుమ‌తుల‌ను ప్రదానం చేశారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడపడుచులు రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పాటలు పాడి ఆడారు.

సిడ్నీ బతుకమ్మ చైర్మన్ అనిల్ మునగాల ఈ సందర్భంగా మాట్టాడుతూ.. తెలంగాణ ఎన్నారైలు వేల మైళ్ల దూరంలో ఉంటున్నా మ‌న‌ససంతా తెలంగాణపైనే ఉంటుంద‌న్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను, ఆచార వ్య‌వ‌హారాల‌ను పాటిస్తుండ‌టం, ఇక్క‌డే పుట్టి పెరిగిన పిల్ల‌ల‌కు కూడా తెలంగాణ సంస్కృతిని తెలియ‌జెప్ప‌డమే సంస్థ ముఖ్య ఉదేశ్యంని తెలిపారు. అందరూ ఒక్కచోట కూడి ఇలా బతుకమ్మను వేడుకగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎస్‌బీడీఎఫ్‌ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్ అన్నారు.

ఈ బతుకమ్మ సంబురాల్లో సుమారు 1700 నుండి  2000 మంది వరకు పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నేత ఇనుగుల పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ జానపద గాయినీ వాణి వోలోలా తన బతుకమ్మ పాటలతో అందరిని ఆకర్షించింది. తెలంగాణ జానపద గీతాలతో సురేందర్ మిట్టపల్లి అలరించారు. ప్రవాస తెలంగాణవాసులే కాకుండా.. పంజాబీలు, చైనీయులు, తమిళులతో పాటు వివిధ  ప్రాంతాలకు చెందిన వారు కూడా పాల్గొని బతుకమ్మ వేడుకలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. ఈ వేడుకల్లో కోలాటం, ప్రత్యేక దాండియా షో, జమ్మి పూజ, శివ గర్జన డ్రమ్స్, బతుకమ్మ స్పెషల్ లేజర్ షో, స్పెషల్ ఫోక్ బ్యాండ్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరు.

సిడ్నీ బతుకమ్మ ప్రధాన కార్యదర్శి అశోక్ మాలిష్ వందన సమర్పణ చేస్తూ, ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావటానికి స్పాన్సర్స్, కమూనిటీ పార్ట్నర్స్, మీడియా పార్ట్నర్స్, వాలెంటీర్స్, అడ్వయిజరీ బోర్డు, సమన్వయకర్తలు, ప్రదీప్ రెడ్డి సేరి, గోవెర్దన్ రెడ్డి ముద్దం, వినయ్ కుమార్ యమా, ప్రాశాంత్ కుమార్ కడపర్తి, చేసిన కృషి కారణమన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి  గుమ్మడివాలి, కిషొర్ యాదవ్, సునీల్ కల్లూరి, మిథున్ లోక, ప్రదీప్ తెడ్ల, శశి మన్నెం,  కిషొర్ రెడ్డి పంతులు, నటరాజ్ వాసం, డేవిడ్ రాజు, ఇంద్రసేన్ రెడ్డి, పాపి రెడ్డి, నర్సింహా రెడ్డి, ప్రమోద్ రెడ్డి ఏలేటి,  కిరణ్ అల్లూరి, మరియు ఇతర సంగాల అధ్యక్షలు తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement