సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ 14 రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత సహచర ఆటగాళ్లతో కలిసి సరదాగా బయటకు వచ్చాడు. హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్ అతడి భార్య ఆషితా సూద్ లను సిడ్నీలోని ఓ కేఫ్‌లో కలుసుకున్నాడు. ఈ ఫోటోను రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాకు పయనమైన సంగతి తెలిసిందే. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉంచారు.
ఇక టీమిండియా- ఆసీస్ జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ-20లు, నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది. నేడు తొలి వన్డే ప్రారంభమైంది. ఇక మూడు వన్డేలకు గానూ రెండు మ్యాచ్‌లు సిడ్నీలో, ఫైనల్ మ్యాచ్ కాన్‌బెర్రాలో జరగనుంది. శుక్రవారం జరిగే మొదటి మ్యాచ్‌లో రాహుల్, మయాంక్, హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. రోహిత్‌శర్మకు గాయం కావడంతో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లకు వైస్ కెప్టెన్ బాధ్యతలు కేఎల్ రాహుల్‌కు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment