
హైదరాబాద్: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ తన సహచర క్రికెటర్, యువసంచలనం రిషభ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. మాజీ లెఫ్టార్మ్ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న షమీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో యువ సంచలనం పంత్‌లో ఆసాధారణ ఆట దాగి ఉందని పేర్కొన్నాడు. ‘పంత్ మంచి ప్రతిభ గల ఆటగాడు. నా స్నేహితుడని అలా చెప్పడం లేదు. అయితే అతడిలో కాస్త ఆత్మవిశ్వాసం లోపించింది. ఏ రోజైతే అతడు పూర్తి విశ్వాసంతో ఆడతాడో ఆరోజు ప్రత్యర్థి జట్టు ప్రమాదంలో పడినట్టే’అని షమీ పేర్కొన్నాడు.
అదేవిధంగా మరో బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌ను కూడా పొగడ్తలతో ముంచెత్తాడు. ‘కేఎల్ రాహుల్ ప్రస్తుతం అతడి కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అందుకే ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా పరుగులు రాబడుతున్నాడు. కీపింగ్ అతడికి అదనపు బలం. అతడి ఫామ్ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా. ఎవరైనా ఆల్‌రౌండర్ కావాలని అనుకుంటే హార్దిక్ పాండ్యాలా ఉండండి. నా దృష్టిలో హార్దిక్ బెస్ట్ ఆల్‌రౌండర్. ఇక ప్రపంకప్-2019లో భాగంగా అఫ్గనిస్తాన్‌పై తీసిన హ్యాట్రిక్ నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనది. నేను ఎప్పుడు చివరి ఓవర్ వేసిన రెండు విషయాలను గుర్తుచేసుకుంటా.. జట్టు ప్రణాళికలను అమలు పర్చడంతోపాటు నా బౌలింగ్‌లోని ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఇవి రెండు తప్పా మరొక ఆప్షన్ ఉండదు’అని షమీ వ్యాఖ్యానించాడు.
చదవండి:
‘ఇదేం పద్ధతి.. నాకైతే అర్థం కావట్లేదు’
ఐసోలేషన్ క్రికెట్ కప్.. ఐసీసీ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment