'తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నాడు' | Aakash Chopra Reckons Rishabh Pant About | Sakshi
Sakshi News home page

'తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నాడు'

Published Tue, Dec 8 2020 11:10 AM | Last Updated on Tue, Dec 8 2020 12:15 PM

Aakash Chopra Reckons Rishabh Pant About  - Sakshi

సిడ్నీ : రిషబ్‌ పంత్‌ కెరీర్‌ ప్రమాదంలో పడిందని.. ఇప్పటికైనా ఆటతీరు మార్చుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇప్పటికైనా తనకున్న బద్దకాన్ని వదిలేసి ఆట మీద దృష్టి పెడితే మంచిదని పేర్కొన్నాడు. పంత్‌ ఆటతీరు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో టెస్టు జట్టులో కూడా చోటు దక్కడం కష్టమేనని తెలిపాడు. (చదవండి : మీరే కాదు.. నేనూ మిస్సవుతున్నా : కోహ్లి)

'ఆసీస్‌ టూర్‌కు పంత్‌ను కేవలం టెస్టు జట్టుకు మాత్రమే పరిగణలోకి తీసుకున్నా రాహుల్‌ ఫామ్‌ దృష్యా.. మరోవైపు వృద్ధిమాన్‌ సాహాకు టెస్టుల్లో ఉన్న రికార్డు చూసుకుంటే పంత్‌ టెస్టులు ఆడడం కష్టమే. ఆసీస్‌- ఏతో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ ఇండియా- ఏ తరపున  పంత్‌ స్థానంలో సాహాకు స్థానం లభించిదంటేనే విషయం అర్ధమయి ఉండాలి. రానున్న రోజుల్లో పంత్‌ టెస్టుల్లో కూడా తన స్థానాన్ని కోల్పోనున్నాడు. ఇప్పటికైనా బద్దకాన్ని వదిలేసి ఆటతీరును మార్చుకోవాలి. ఆటలో తను చేసిన తప్పిదాలే.. ఇప్పుడు పంత్‌ కెరీర్‌ను ప్రశ్నార్థకం చేశాయి. స్వయంగా తన కెరీర్‌ను తానే నాశనం చేసుకుంటున్నాడు. మళ్లీ తుది జట్టులోకి రావాలంటే కఠోర సాధన చేయాల్సిన అవసరం ఉంది.. లేదంటే అతని కెరీర్‌ ముగిసినట్లే 'అని వెల్లడించాడు. 

ఆకాశ్‌ చోప్రా పంత్‌పై చేసిన వ్యాఖ్యలు నిజమనే అభిప్రాయం వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. వాస్తవానికి పంత్‌ మంచి టెక్నిక్‌ ఉన్న ఆటగాడు.. టీమిండియాకు ఎంపికైన మొదట్లో దూకుడైన ఆటతీరును చూసి మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాడిగా పేరు సంపాదిస్తారని అంతా భావించారు. కానీ రాను రాను పంత్‌ ఆటతీరులో నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపించేది. ఎదో మొక్కుబడికి ఆడుతున్నామా అన్నట్లుగా అతని షాట్లు ఉండేవి. ఆట కీలకదశలో ఉన్న సమయంలో ఎన్నోసార్లు నిర్లక్ష్యంగా వికెట్‌ సమర్పించుకునేవాడు. ఇదే సమయంలో కేఎల్‌ రాహుల్‌ నిలకడైన ప్రదర్శన చేస్తూ టీమిండియాలో  తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. కేవలం పంత్‌ నిర్లక్ష్యమే ఇప్పుడు ఆసీస్‌తో జరిగిన పరిమిత ఓవర్లతో పాటు ప్రస్తుతం  జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరం చేసింది. ఐపీఎల్‌లోనూ పంత్‌ నుంచి ఒక్క మంచి ఇన్నింగ్స్‌ రాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లు గెలవడంలో సహకరించిన పంత్‌ భారీ ఇన్నింగ్స్‌లు మాత్రం ఆడలేకపోయాడు. (చదవండి : ధావన్‌.. నేను ధోనిని కాదు: వేడ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement