Telangana BTech Girl Brain Dead In Australia Sydney Road Accident | ఆస్ట్రేలియాలో తెలంగాణ విద్యార్థిని బ్రెయిన్‌డెడ్‌ - Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో తెలంగాణ విద్యార్థిని బ్రెయిన్‌డెడ్‌

Published Sat, Jan 2 2021 1:27 PM | Last Updated on Sat, Jan 2 2021 7:09 PM

Btech Student From Telangana Was Brain Dead In Australia - Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన రక్షిత అనే బీటెక్‌ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్‌‌ అయింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన 20ఏళ్ల రక్షిత.. సిడ్నీలోని ఐఐబీఐటీ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతోంది. డిసెంబర్ 31న రక్షిత బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రక్షితకు బ్రెయిన్ డెడ్ అయినట్లు అక్కడి వైద్యులు నిర్థారించారు. 

ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన తమ కూతురు రోడ్డు ప్రమాదానికి గురైందని తెలిసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురి అవయవాలను దానం చేస్తున్నట్లు యువతి తల్లిదండ్రులు మల్లెపల్లి వెంకట్ రెడ్డి, అనితలు ప్రకటించారు. మాజీ సైనిక ఉద్యోగి అయిన వెంకట్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని డీఆర్డీఓలో పని చేస్తున్నారు.

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement