
సిడ్నీ : ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా స్నిన్నర్ యజ్వేంద్ర చహల్ అరుదైన రికార్డును సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. చహల్ ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీసినా టీ20ల్లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి ఉండేవాడు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో 13వ ఓవర్‌లో చహల్ బౌలింగ్‌కు వచ్చాడు. ఓవర్ చివరి బంతిని గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఫ్లిక్ చేయగా.. బంతి వెళ్లి కీపర్ రాహుల్ చేతుల్లో పడింది. మ్యాక్సవెల్ కూడా బంతి బ్యాట్‌కు తగలడంతో క్రీజును వీడాడు. కానీ అంపైర్ దానిని నోబాల్‌గా ప్రకటించడంతో మ్యాక్స్‌వెల్ బతికిపోయాడు. అలా చహల్‌కు వికెట్‌కు తీసే అవకాశం కోల్పోయాడు.(చదవండి : వారెవ్వా శామ్సన్.. వాట్ ఏ ఫీల్డింగ్)
దీంతో చహల్ టీమిండియా తరపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సాధించాలంటే మరికొద్ది కాలం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పట్లో టీమిండియా టీ20 మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఆసీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ ఉండడంతో చహల్ మరికొంత కాలం ఆగాలి. ఈలోగా టీ20 ప్రపంచకప్ నిర్వహణ సాధ్యమైతే చహల్ ఈ రికార్డును చేరే అవకాశం ఉంటుంది.ఇప్పటికైతే టీమిండియా తరపున టీ20ల్లో చహల్ 59 వికెట్లతో బుమ్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. చహల్ 45 మ్యాచ్‌ల్లోనే 59 వికెట్లు సాధించగా.. బుమ్రా మాత్రం 49 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు తీశాడు.