![Woman Escapes With Gold Chain In Kurnool District - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/11/Woman-Escapes-With-Gold-Cha.jpg.webp?itok=jfLUEiD0)
కర్నూలు (టౌన్): కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో ఓ మాయలేడి ఇంట్లోకి వచ్చి ఓ మహిళను క్షణాల్లో బురిడీ కొట్టించి బంగారు గొలుసుతో ఉడాయించింది. శుక్రవారం నగరంలోని స్టాంటన్‌పురంలో కళావతమ్మ అనే మహిళ ఇంటికి ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు వచ్చానని నమ్మించింది.
చదవండి: Anantapur: ఆగని టీడీపీ అరాచకం
వ్యాక్సిన్ వేసే ముందుగా కళ్లలో రెండు చుక్కలు మందు వేసుకోవాలని చెప్పి బాధితురాలి కళ్లలో చుక్కలు వేయడంతో కళ్లు మూసుకుంది. ఇదే అదునుగా భావించి కళావతమ్మ మెడలోని 25 గ్రాముల బరువున్న బంగారు గొలుసును మాయలేడి తెంపుకుని ఉడాయించింది. బాధితురాలు గట్టిగా కేకలు వేసుకుంటూ బయటకు వచ్చి చూసినా గుర్తు తెలియని మహిళ కనిపించలేదు. దీంతో అర్బన్ తాలూకా పోలీసు స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment