మ్యాట్రిమోనీలో పరిచయం.. సహజీవనం చేసి.. కోరిక తీర్చుకుని.. | Man Cheating Woman Through Matrimony Site In Kurnool District | Sakshi
Sakshi News home page

మ్యాట్రిమోనీలో పరిచయం.. సహజీవనం చేసి.. కోరిక తీర్చుకుని..

Published Sun, Nov 21 2021 6:21 PM | Last Updated on Sun, Nov 21 2021 6:21 PM

Man Cheating Woman Through Matrimony Site In Kurnool District - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): మ్యాట్రిమనీ వెబ్‌సైట్‌లో పరిచయమైన వ్యక్తి రెండు నెలల పాటు సహజీవనం చేయడంతో పాటు బంగారు, నగదుతో ఉడాయించిన సంఘటన కర్నూలులో చోటుచేసుకుంది. స్థానిక బాలా జీనగర్‌కు చెందిన ఓ మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదించి ఆమె విడాకులు ఇచ్చింది. ఈ క్రమంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఓ మ్యాట్రిమనీలో తన వివరాలను అప్‌లోడ్‌ చేసింది.

చదవండి: వృద్ధుడి పైశాచికం.. కామంతో కళ్లు మూసుకుపోయి..

ఈ వివరాలను చూసిన చంద్రశేఖర్‌ అనే వ్యక్తి తాను రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ఆమెను నమ్మించాడు. రెండు నెలల పాటు కర్నూలులోనే ఆమెతో పాటు ఉన్నాడు. ఇటీవల ఆమె వద్ద 8 తులాల బంగారు, రూ.2లక్షల నగదు తీసుకుని ఉడాయించాడు. దీంతో ఆ మహిళ జరిగిన మోసంపై తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement