
ముంబై : కరోనా సోకిన 49 ఏళ్ల హంతకుడు క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న ఘటన మహారాష్ర్టలోని థానేలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల ప్రకారం..కళ్యాణ్ మోహన్ అనే వ్యక్తి మే 30న భార్యను హత్య చేసిన ఘటనలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో జూన్ 16న నిందితుడికి జలుబు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు బయటపడటంతో పరీక్షలు నిర్వహించగా కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అతడ్ని క్వారంటైన్ సెంటర్‌కు తరలించి అతడిపై నిఘా ఉంచేందుకు ముగ్గురు పోలీసు సిబ్బందిని నియమించగా ఆదివారం రాత్రి పరారయ్యాడు. అయితే నిందితుడికి ఎవరెవరిని కలిశాడు అతని ద్వారా ఎంత మందికి వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చు అన్నదానిపై విశ్లేషిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. (భర్తకు బీమా చేసి హత్య చేసిన భార్య )
Comments
Please login to add a commentAdd a comment