వరంగల్ జిల్లా హన్మకొండలోని ఇంటర్ ఆర్జేడీ కార్యాలయంలో గురువారం ఉదయం ఓ పాము కలకలం రేపింది.
హన్మకొండ: వరంగల్ జిల్లా హన్మకొండలోని ఇంటర్ ఆర్జేడీ కార్యాలయంలో గురువారం ఉదయం ఓ పాము కలకలం రేపింది. కార్యాలయంలోని ఫర్నిచర్ లోకి దూరిన పామును గమనించిన సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. స్థానికంగా పాములు పట్టే యాకూబ్ అనే వ్యక్తిని రప్పించారు. అతడు వచ్చి అతికష్టం మీద పామును పట్టుకుని దూరంగా తీసుకెళ్లి వదిలేశాడు. దీంతో సిబ్బంది, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.