పెళ్లిళ్లు, ఇల్లు, వాన.. చివరికి అందమైన స్రీలను చూసినా భయపడేవారు ఉన్నారీ ప్రపంచంలో. మనం నవ్వుకుంటాము కానీ దాన్ని అనుభవించేవాళ్లకి నరకం కనిపిస్తుంది. అటువంటి భయాల్లో సైనోఫోభియా ఒకటి. అంటే కుక్కలను చూస్తే చాలు ఆ చుట్టుపక్కల కనిపించరన్నమాట. కారణాలు అనేకం ఉండోచ్చు. అంటే చిన్నతనంలో కుక్క వెంటబడటంవల్ల కలిగినదికావొచ్చు. లేదా ఎవరినైనా రక్తం వచ్చేలా కరవడం చూసి భయపడటం కావచ్చు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో కుక్కల పట్ల భయం వీరిలో పేరుకుపోతుంది. ఐతే ఈ ఫోభియా నుంచి బయటపడే మార్గాలు న్యూయార్క్‌లోని నార్త్‌వెల్ హెల్త్ సౌత్ ఓక్స్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లారీ విటగ్లియానో మాటల్లో మీకోసం..
అనేక ఇతర రుగ్మతల మాదిరిగానే ఇది కూడా ఒక ఫోబియానే. కుక్కల పట్ల భయం చాలా చిన్నవయసులోనే ప్రారంభమవుతుంది. ఈ ఫోబియా ఉన్నవారి చుట్టు పక్కల కుక్కలు కనిపిస్తే వారి గుండె వేగం పెరుగుతుంది. వణుకు, వికారం, చెమట్లు పట్టడం ఒక్కోసారి భయంతో కళ్లు తిరిగి పడిపోతారు కూడా.
చికిత్స
ఈ రుగ్మతతో బాధపడే వారికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ)తో చికిత్స చేయవచ్చు. ప్రారంభంలో కుక్క ఇమేజ్ చూపించడం ద్వారా ఆ తర్వాత బొమ్మ కుక్క, ఆపైన నిజం కుక్కను చూపడం ద్వారా ఈ భయాన్ని దూరం చేయవచ్చు.
భయాన్ని ఈ విధంగా అధిగమించవచ్చు
కుక్కలను చూసి భయపడటం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో.. వీలైనంత త్వరగా వాటితో చనువుపెంచుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే దీర్ఘకాలిక ముద్ర మీ మనసుపై పడే అవకాశం ఉంది. గుడ్ బియేవియర్ కలిగిన కుక్కతో కొంత సమయం గడపగలగాలి. అంతేకాకుండా కుక్కల గురించిన వివిధ అధ్యనాలు చదవాలి. తద్వారా అవి కరిచే ప్రమాదం ఎంత అరుదుగా ఉంటుందో తెలుసుకోండి. థెరపిస్టులను కలిసి మీ ఫోబియాను అధిగమించే మార్గాలను తెలుసుకొని వాటిని ఆచరించడం ద్వారాసైనోఫోభియాను అధిగమించవచ్చని బిహేవియరల్ సైకోథెరపి నిపుణులు డాక్టర్ విటగ్లియానో సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment