
గల్సీ (పశ్చిమ బెంగాల్): పోలింగ్ బూత్ వద్ద భద్రతా బలగాల కాల్పుల తర్వాత ఆ మృతదేహాలతో ర్యాలీ చేపట్టాలని తాను ఆదేశించానని చెబుతున్న ఆడియో టేప్ వివాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ‘నా ఫోన్‌ను ట్యాప్ చేశారు. ఈ మొత్తం వివాదంపై నిజానిజాలు రాబట్టేందుకు సీఐడీ విచారణకు ఆదేశిస్తాను’ అని మమత ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గల్సీలో జరిగిన సభలో మమత ప్రసంగించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పోల్చుకుంటే తృణమూల్ కాంగ్రెస్‌తో ఏ పార్టీ సాటిరాలేదని మమత వ్యాఖ్యానించారు.
‘వంట చేస్తున్నామా.. ఇంటి పని చేస్తున్నామా అనేది సహా మా దినచర్య మొత్తం మీద బీజేపీ నిఘా పెట్టింది అని ఆరోపించారు. అయితే ఈ కుట్రలో మా పాత్ర లేదు అని బీజేపీ చెబుతోంది. మరోవైపు ఈ ఆడియో టేప్ వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ‘ఆ ఆడియో టేప్ నకిలీది. అలాంటి సంభాషణ జరగనే లేదు. అయినా, కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేయడం ఆశ్చర్యంగా ఉంది’ అని టీఎంసీ వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment