phone tap
-
డీజీపీ, ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజికవర్గం ఆధారంగా డీజీపీని అనుమానిస్తున్నారని, ఇది తగదని అన్నా రు. పోలీసుల్లో ఒకే విభాగానికి ప్రభుత్వపెద్దలు పెద్దపీట వేస్తున్నారని, పోలీసు శాఖ రెండు వర్గాలుగా చీలిపోయిందని వ్యాఖ్యానించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టులుగా పేరొందిన కరీంనగర్ జిల్లాకు చెందిన వేణుగోపాల్‌రావు, నర్సింగరావు, ప్రవీణ్‌రావు, రమణకుమార్‌లతో కూడిన 30 మంది బృందంతో రాజకీయ నేతలపై ఆధునిక సాంకేతికతతో నిఘా పెట్టారని, దీని కోసం ఓ విశ్రాంత ఐపీఎస్ నేతృత్వంలో ప్రత్యేక సెల్ నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవర్గానికి చెందిన ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా తమవర్గానికి ప్రాధాన్యతనిస్తున్నారని, ఈ మేరకు ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి గజానన్ని డిప్యుటేషన్ మీద తీసుకువచ్చారని ఆరోపించారు. తనకు అనుకూలమైన అధికారులకు హైదరాబాద్‌లో పోస్టింగులు ఇప్పించుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. వాటాల పంచాయితీతోనే ఉపఎన్నిక ఇరవై ఏళ్లు మంత్రి హరీశ్‌రావుతో సహవాసం చేసిన ఈటల రాజేందర్ అకస్మాత్తుగా దొంగ ఎలా అయ్యారని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ చైర్మన్‌గా ఉన్న టీఆర్ఎస్ అనే కంపెనీలో వాటా అడుగుతున్నాడన్న అక్కసుతోనే రాజేందర్‌ను డైరెక్టర్ పదవి నుంచి తొలగించారని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ము పంచుకునే విషయంలో తలెత్తిన వివాదాలే ఈటల రాజీనామాకు దారితీశాయని, అందుకే హుజూరాబాద్ ఉపఎన్నిక వచ్చిందని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ తోడుదొంగలేనని విమర్శించారు. ఏడేళ్లలో ప్రధాని గ్యాస్, పెట్రో, నిత్యావసరాల ధరలు పెంచడం తప్ప ఇంకేమీ చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ నయా నిజాం అని, తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు అల్లుడు హరీశ్‌రావు అనే ఖాసీం రిజ్వీని దింపారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత తెలంగాణను పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీలో కేసీఆర్ బీజేపీ, నడ్డా బీజేపీ అని రెండు విభాగాలు ఉన్నాయని, బండి సంజయ్ ఆటలో అరటి పండు అని వ్యాఖ్యానించారు. అందుకే మురళీధర్ రావు, సుగుణాకర్‌రావు, విద్యాసాగర్‌రావులు బండి సంజయ్‌ని పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 2022లో ముందస్తు ఎన్నికలకు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్లో ముసలం పుడుతుందని రేవంత్ జోస్యం చెప్పారు. కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు 2022 డిసెంబర్లో కేసీఆర్ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు సూసైడ్ టెండెన్సీ ఉందని, ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెదరగొట్టడం ఆయనకు అలవాటేనని అన్నారు. ఇందుకు 2004 నుంచి 2018 వరకు తన పార్టీ ప్రజాప్రతినిధులు, ఆయన చేసిన రాజీనామాలు, ముందస్తు ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. దళితబంధు కోసం ఇప్పుడు కేటాయించిన రూ.రెండు వేల కోట్లనే విడుదల చేయలేదని,మాటలతో మభ్యపెట్టే కేసీఆర్‌ను 2022 ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడిస్తారని, ఆ దెబ్బకు కేసీఆర్ ఆత్మహత్య చేసుకుంటారని అన్నారు. హైదరాబాద్‌లో వరద సాయం కోసం రూ.10 వేలే సరిగా ఇవ్వనివారు, దళితబంధు కింద లక్షలాది మందికి రూ.10 లక్షల చొప్పున ఎలా ఇస్తారని ప్రశ్నించారు. -
‘నా ఫోన్‌ను ట్యాప్ చేశారు’: ముఖ్యమంత్రి
గల్సీ (పశ్చిమ బెంగాల్): పోలింగ్ బూత్ వద్ద భద్రతా బలగాల కాల్పుల తర్వాత ఆ మృతదేహాలతో ర్యాలీ చేపట్టాలని తాను ఆదేశించానని చెబుతున్న ఆడియో టేప్ వివాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ‘నా ఫోన్‌ను ట్యాప్ చేశారు. ఈ మొత్తం వివాదంపై నిజానిజాలు రాబట్టేందుకు సీఐడీ విచారణకు ఆదేశిస్తాను’ అని మమత ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గల్సీలో జరిగిన సభలో మమత ప్రసంగించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పోల్చుకుంటే తృణమూల్ కాంగ్రెస్‌తో ఏ పార్టీ సాటిరాలేదని మమత వ్యాఖ్యానించారు. ‘వంట చేస్తున్నామా.. ఇంటి పని చేస్తున్నామా అనేది సహా మా దినచర్య మొత్తం మీద బీజేపీ నిఘా పెట్టింది అని ఆరోపించారు. అయితే ఈ కుట్రలో మా పాత్ర లేదు అని బీజేపీ చెబుతోంది. మరోవైపు ఈ ఆడియో టేప్ వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ‘ఆ ఆడియో టేప్ నకిలీది. అలాంటి సంభాషణ జరగనే లేదు. అయినా, కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేయడం ఆశ్చర్యంగా ఉంది’ అని టీఎంసీ వ్యాఖ్యానించింది. -
ఒబామా నా ఫోన్లు ట్యాప్ చేశారు: ట్రంప్
వాషింగ్టన్ : ట్రంప్ టవర్లలోని తన ఫోన్లను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్యాప్ చేశారని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ శనివారం ఆరోపించారు. ఎన్నికల సమయంలో, ఫలితాలు వెలువడక ముందే ఈ ట్యాపింగ్ జరిగిందంటూ ఆయన ట్వీట్లలో చెప్పారు. ట్యాపింగ్‌ను ట్రంప్ ‘వాటర్‌గేట్’ కుంభకోణంతో పోల్చారు. అయితే ట్యాపింగ్ ఆధారాలను ట్రంప్ బయటపెట్టలేదు. ‘ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వ్యక్తి ఫోన్లను సిట్టింగ్ అధ్యక్షుడు ట్యాప్ చేయడం న్యాయ సమ్మతమేనా? మరింత దిగజారిపోయారు’అని ఒబామాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘ఎన్నికలవేళ ఫోన్లను ట్యాప్ చేయడానికి ఒబామా ఎంత దిగజారిపోయారు! ఒబామా చెడ్డవారు’ అని మరో ట్వీట్‌చేశారు. ఈ ఆరో పణలను ఒబామా తోసిపుచ్చారు. ‘అక్టోబర్‌లో ఒబామా నా ఫోన్లను ట్యాప్ చేసిన అంశంపై ఒక మంచి లాయర్ బలమైన కేసు వేయగలరు’ అని ట్రంప్ పేర్కొన్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో రష్యా రాయబారిని కలిసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అటార్నీ జనరల్ సెసన్స్ ను ట్రంప్ వెనకేసుకొచ్చారు. ఒబామా కాలంలోనే సెసన్స్ , రష్యా రాయబారు లు అధికారికంగా సమావేశమయ్యారని ట్రంప్ గుర్తుచేశారు. సెసన్స్ ను కలిసిన రష్యా రాయబారే ఒబామా పదవిలో ఉన్నప్పుడు శ్వేతసౌధానికి 22 సార్లు వచ్చి వెళ్లారనీ ట్వీట్లో పేర్కొన్నారు. ట్రంప్ లాయర్లకు గడువు సియాటెల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణ నిషేధ ఉత్తర్వులను సవాలు చేస్తూ కొందరు చట్టబద్ధ పౌ రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సియాటెల్ ఫెడరల్ జడ్జి ట్రంప్ లాయర్లకు రెండు వారాల గడువు ఇచ్చారు. యుద్ధ ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న తమ పిల్లలను కలుసు కోవడానికి ఆ ఉత్తర్వులు అడ్డంకిగా మారాయని వారు ఆరోపించారు. ఫిర్యాదుదారులు ఈ కేసును ‘క్లాస్ ఆక్షన్ ’ న్యాయవ్యాజ్యంగా మార్చుకోవడానికి చేస్తున్న యత్నాలపై స్పందించడానికి ట్రంప్ లాయర్లకు తగిన సమయం ఇస్తున్నట్లు జడ్జి జేమ్స్ రాబర్ట్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
'ఆయన అంత పెద్ద నాయకుడు కాదు'
హైదరాబాద్: కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం ఫోన్ ట్యాప్ చేసేంత పెద్దనాయకుడు కాదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప ఎద్దేవా చేశారు. ముద్రగడ దీక్షను ప్రభుత్వం పట్టించుకోదని ఆయన తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చట్ట ప్రకారం చర్యతీసుకుంటారని చినరాజప్ప అన్నారు. మంత్రి రావెల కిషోర్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై చినరాజప్ప మాట్లాడుతూ.. తప్పుచేసినట్లు తేలితే తెలంగాణ ప్రభుత్వం ఆయనపై చట్టప్రకారం చర్య తీసుకుంటుందన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని మంత్రి స్పష్టం చేశారు. -
ఆమె ఫోన్‌ను ట్యాప్ చేయడం వల్లనే..
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిపిన ఉగ్రవాద దాడులకు కీలక సూత్రదారిగా భావిస్తున్న అబ్దుల్ హమీద్ అబౌద్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. పారిస్ దాడి అనంతరం హమీద్ కోసం భద్రతా బలగాలు దేశం మొత్తం జల్లెడ పట్టాయి కానీ అతని ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయాయి. అయితే ఓ మహిళ ఫోన్ నెంబర్‌ను ట్యాప్ చేయడంతో హమీద్ ఆచూకీని కనిపెట్టగలిగామని ఫ్రెంచ్ పోలీసు అధికారులు శుక్రవారం వెల్లడించారు. హస్నా ఐత్బులసేన్ అనే మహిళ ఫోన్ నెంబర్‌ను పోలీసులు ఓ డ్రగ్స్ కేసులో విచారణ సందర్భంగా ట్యాప్ చేశారు. అయితే ఆవిడకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో పారిస్ దాడుల నేపథ్యంలో ఈమె సంభాషణలపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ ట్యాపింగ్ మూలంగానే నిఘావర్గాలకు సెయింట్ డెనిస్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం తెలిసింది. భద్రతా దళాలు ఏడు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాది అబ్దుల్ హమీద్‌ను హతమార్చారు. కాగా, మహిళా ఉగ్రవాది హస్నా ఐత్బులసేన్ ఆత్మాహుతికి పాల్పడింది. -
ఫోన్లు ట్యాప్ చేస్తే బయటికొచ్చేది చంద్రబాబు బాగోతాలే : శ్రీకాంత్‌రెడ్డి
చంద్రబాబు, ఆ పార్టీ నేతల నేరచరిత్ర చెప్పాలంటే సమయమే సరిపోదు సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెబుతున్నట్లుగా అందరి ఫోన్లూ ట్యాప్ చేయాలని, అప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బాగోతాలన్నీ బయటకు వస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ను కాపాడుతున్న చంద్రబాబుకు, టీడీపీ నేతలకు తమను విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘గోబెల్స్ ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న ఆ పార్టీ నేతలు, ముఖ్యంగా యనమల రామకృష్ణుడుకు జగన్మోహన్రెడ్డి తప్ప మరేమీ కనిపించదు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వారు ఏ ఒక్కరోజూ లేఖలు రాసిన దాఖ లాలు లేవు. కానీ, మా నాయకుడిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఫోన్లు ట్యాప్ చేస్తే బండారం బయటపడుతుందని యనమల అంటున్నారు! నిజమే ఆయన చెప్పినట్లు అందరి ఫోన్లూ ట్యాప్ చేస్తే చీకట్లో చిదంబరంతో జరుపుతున్న సంభాషణలన్నీ బయటకొస్తాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు, రాజ్యసభలో ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడేందుకు టీడీపీ చేసిన బాగోతాలన్నీ వెలుగులోకి వస్తాయి’’ అని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుగా, జననేతగా ప్రజల్లో జగన్‌కు వచ్చిన ఆదరణ తన కొడుక్కి రాలేదనే అక్కసుతో చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ ఆరోపించారు. ఏమాత్రం విషయం లేని తన కుమారుడిని ప్రమోట్ చేసుకోవడానికి చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల మనోభావాలు తెలియని, కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం ట్విట్టర్లో ట్వీట్ల పేరుతో చీప్ ట్రిక్స్ చేస్తున్న లోకేష్.. ఒక చవటబ్బాయని విమర్శించారు. లోకేష్‌బాబు గురించి ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు గతంలో అసెంబ్లీ సాక్షిగా గుట్టు రట్టుచేసిన విషయం మరిచారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ నేతలకు బాబే ఆదర్శం! జగన్మోహన్రెడ్డిపై గోబెల్స్ ప్రచారం చేస్తున్న చంద్రబాబు నైజమేంటో యావత్ తెలుగు ప్రజానీకానికీ తెలుసని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి.. పదవిని, పార్టీని లాగేసుకున్న చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆ పార్టీ నేతలు ముందుకెళ్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ జడ్చర్ల ఎమ్మెల్యే చంద్రశేఖర్ సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హతమార్చి చంద్రబాబు శిష్యుడనిపించుకున్నారని మండిపడ్డారు. ఇటీవలే ‘ఫోరం ఢఫర్ గుడ్ గవర్నెన్స్’ సంస్థ 28 మంది టీడీపీ ఎమ్మెల్యేల నేరచరిత్రను బయటపెట్టిందన్నారు. ‘‘హత్యకేసుల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్, యరపతినేని శ్రీనివాసరావు, కందికుంట వెంకటప్రసాద్, చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. బాలికపై అత్యాచారం కేసులో కోవూరు ఎమ్మెల్యే రామారావు, భూకబ్జా కేసులో సుమన్ రాథోడ్ నిందితులుగా ఉన్నారు. ఇటీవల చీటింగ్ కే సులో అరెస్టయిన సాయిబాబు.. చంద్రబాబుకు, రాజగురువు రామోజీరావుకు అకౌంటెంట్‌గా ఉన్న విషయం వాస్తవం కాదా?’‘ అని శ్రీకాంత్ ప్రశ్నించారు. తన కేబినేట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి నకిలీస్టాంపుల కుంభకోణంలో మూడేళ్ల శిక్ష అనుభవించి వచ్చాక తిరిగి పార్టీలోకి చేర్చుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ‘‘పాస్‌పోర్టు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తికి ఏకంగా మలక్‌పేట్ టికెట్ ఇచ్చారు. పేరం హరిబాబు తీసుకెళ్తున్న కారులో దొరికిన రూ. 7 కోట్లు చంద్రబాబువే అని చెప్పినా.. ఇప్పటిదాకా దానికి లెక్కాపత్రమేలేదు’’ అని పేర్కొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు, ఆ పార్టీ నేతల నేరచరితకు సమయమే సరిపోదన్నారు. అందుకే విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు చంద్రబాబును రెండుసార్లు ఛీకొట్టారన్నారు. ‘‘అద్దాల మేడలో ఉండేవారు ఎదుటివారి ఇంటిపై రాళ్లు వేయాలనుకుంటే తన ఇల్లే కూలిపోతుందని మోసం, దగా, కుళ్లు, కుతంత్రాలతో మనసు నిండిన చంద్రబాబు గ్రహించాలి’’ అని సూచించారు.