
కోల్‌కతా: నందిగ్రామ్ కౌంటింగ్ టీ20 సూపర్ ఓవర్‌ను తలపిస్తోంది. తొలుత మమత గెలిచారంటూ న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ప్రకటించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది అంటూ వార్తలు వెలువడ్డాయి. 1,950 ఓట్లతో సువేందు గెలిచాడని జాతీయ మీడియా వెల్లడిచంచింది. దాంతో ప్రజల తీర్పు గౌరవిస్తానంటూ మమతా బెనర్జీ ప్రకటించారు.
తాజాగా నందిగ్రామ్ ఫలితంపై ఈసీ మరోసారి స్పష్టత ఇచ్చింది. లెక్కించాల్సిన ఓట్లు ఇంకా ఉన్నాయి అని ఈసీ వర్గాలు ప్రకటించాయి. ఇంకా నందిగ్రాం ఫలితం ప్రకటించలేదు అని తెలిపాయి. నందిగ్రాం ఫలితం రాలేదు అని టీఎంసీ ట్వీట్ చేసింది. ఫలితం ప్రకటించవద్దంటూ టీఎంసీ, ఈసీని కోరింది.
The counting process for Nandigram has not been completed. Please do not speculate.
— All India Trinamool Congress (@AITCofficial) May 2, 2021
ఇక నందిగ్రామ్ ఫలితంపై ప్రారంభం నుంచి గందరగోళం నెలకొనే ఉంది. ఒకానొక దశలో సువేందు, దీదీ కంటే కేవలం ఆరు ఓట్లు వెనకబడినట్లు ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత కాసేపటికే 17వ రౌండ్ కౌంటింగ్‌లో మమత 1,200 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ఏఎన్‌పై ప్రకటించింది. కాసేపటి తర్వాత జాతీయ మీడియా దీదీ ఓడిపోయారంటూ వెల్లడించాయి. సువేందు 1,622 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించాయి. ఫలితం వెలువడిన వెంటనే దీదీ సైతం ఓటమిని అంగీకరిస్తున్నాను అన్నారు. ఓడిపోయినా తానే ముఖ్యమంత్రి అని ప్రకటించారు. ఆ తర్వాత కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈసీ కౌంటింగ్ ఇంకా కొనసాగుతుందని ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment