కోల్‌కత్తా: ఏడో దశ ఎన్నికలు పశ్చిమ బెంగాల్‌లో సోమవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటేసిన అనంతరం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఓ ప్రచార సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడారు. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఎన్నికల సంఘంపై చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ స్వాగతించారు. ఎన్నికల సంఘం తీరుపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం బీజేపీ గూటికి చెందిన చిలకగా అభివర్ణించారు.
‘మద్రాస్ హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా. కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘం కారణమని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఎన్నికల సంఘం బీజేపీ గూటికి చెందిన చిలక. కరోనా కేసులు పెరగడానికి కారణం అదే’ అని మమత బెనర్జీ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యులని పేర్కొన్నారు. ఎన్నికలు త్వరగా ముగించాలని తాము ఎన్నికల సంఘానికి చెప్పినా వినిపించుకోలేదని మమత గుర్తుచేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘం కారణమని పునరుద్ఘాటించారు.
చదవండి:
కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు
Comments
Please login to add a commentAdd a comment