
కోల్‌కతా: టీమిండియా మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ దిండా కారుపై ఈస్ట్ మిడ్నాపూర్‌లో ఓ దుండగుల గుంపు దాడికి పాల్పడింది. పశ్చిమ బెంగాల్‌లోని మొయినా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న దిండా లక్ష్యంగా మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి తెగబడ్డారు. మొయినా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అతను వెళ్తున్న కారుపై సుమారు 50 మంది రాళ్ళు రువ్వినట్లు సమాచారం.
ఈ దాడిలో దిండా తీవ్ర గాయలపాలైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించి, తృణమూల్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని బెంగాల్ బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థుల మధ్య దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడుతూ, రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
చదవండి: డక్‌వర్త్ కన్‌ఫ్యూజన్: కివీస్, బంగ్లా రెండో టీ20లో హైడ్రామా
Comments
Please login to add a commentAdd a comment