Ashok Dinda
-
కొంప ముంచిన వికెట్ కీపర్ హెల్మెట్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. వికెట్ కీపర్ హెల్మెట్ ఇండియా మహారాజాస్ కొంపముంచింది. వరల్డ్ జెయింట్స్ ఇన్నింగ్స్ సమయంలో ఇది చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ అశోక్ దిండా వేశాడు. ఓవర్ మూడో బంతిని ఫుల్‌లెంగ్త్‌తో వేశాడు. క్రీజులో ఉన్న పెరీరా టచ్ చేయాలని చూశాడు. కానీ బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని కీపర్ పార్థివ్ పటేల్ వైపు వెళ్లింది. అయితే పార్థివ్ బంతిని అడ్డుకోలేకపోయాడు. దీంతో బౌండరీ వెళుతుందని మనం అనుకునేలోపే కీపర్ హెల్మెట్‌కు తాకిని బంతి అక్కడే ఆగిపోయింది. దీంతో నిబంధనల ప్రకారం అంపైర్ బైస్ రూపంలో ఇండియా మహారాజాస్‌కు ఐదు పరుగుల ఫెనాల్టీ విధించారు.ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా మహారాజాస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెవిన్ ఒబ్రెయిన్ 52, దినేశ్ రామ్‌దిన్(42 పరుగులు నాటౌట్), తిసార పెరీరా 23 పరుగులతో రాణించారు. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజాస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.తన్మయ్ శ్రీవాత్సవ 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు. చివర్లో పఠాన్ బ్రదర్స్.. యూసఫ్ పఠాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్, ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి జట్టును గెలిపించారు. 5 Runs when ball Hits Keeper Helmet ⛑️😂😂 Dinda Parthiv Bhajji all Smiles 😊@llct20 #LLC pic.twitter.com/fON67VE3hm — Kagiso Rabada (@cricketer_jii) September 16, 2022 -
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై రాళ్ల దాడి
కోల్‌కతా: టీమిండియా మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ దిండా కారుపై ఈస్ట్ మిడ్నాపూర్‌లో ఓ దుండగుల గుంపు దాడికి పాల్పడింది. పశ్చిమ బెంగాల్‌లోని మొయినా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న దిండా లక్ష్యంగా మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి తెగబడ్డారు. మొయినా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అతను వెళ్తున్న కారుపై సుమారు 50 మంది రాళ్ళు రువ్వినట్లు సమాచారం. ఈ దాడిలో దిండా తీవ్ర గాయలపాలైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించి, తృణమూల్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని బెంగాల్ బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థుల మధ్య దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడుతూ, రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చదవండి: డక్‌వర్త్ కన్ఫ్యూజన్: కివీస్, బంగ్లా రెండో టీ20లో హైడ్రామా -
ఆటకు గుడ్‌బై చెప్పిన టీమిండియా క్రికెటర్
ముంబై: పశ్చిమ బెంగాల్‌కు దశాబ్దానికి పైగా ప్రాతినిధ్యం వహించిన పేసర్ అశోక్ దిండా మంగళవారం అంతర్జాతీయ సహా అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కాగా ఆశోక్ దిండా టీమిండియా తరపున 13 వన్డేల్లో 12 వికట్లు, 9 టీ20ల్లో 17 వికెట్లు తీయగా.. ఐపీఎల్లో 78 మ్యాచ్‌లాడి 69 వికెట్లు తీశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 116 మ్యాచ్‌లాడిన దిండా 420 వికెట్లు తీశాడు. కాగా పశ్చిమ బెంగాల్ తరపున దశాబ్దం పాటు ఆడిన దిండా తనపై తప్పుడు ఆరోపణలు రావడంతో గతేడాది బెంగాల్ జట్టు నుంచి తప్పుకున్నాడు. కాగా ఈ సీజన్లో గోవాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. చదవండి: క్రికెటర్ షమీకి భార్య హసీన్ జహాన్ మరో షాక్ ఈ సందర్భంగా దిండా మీడియాతో మాట్లాడాడు.'భారత్ తరఫున ఆడాలనేది ప్రతి ఒక్కరి కోరిక. నేను బెంగాల్ తరఫున ఆడాను. అందుకే నాకు దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. భారత్ తరఫున ఆడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు బీసీసీకి కృతజ్ఞతలు.దీప్‌దాస్ గుప్తా, రోహన్ గావస్కర్ వంటి సీనియర్ ఆటగాళ్లు నాకు మార్గనిర్దేశనం చేశారని' దిండా పేర్కొన్నాడు. చదవండి: వైరల్: షర్ట్ లేకుండా పరిగెత్తాడు.. చివరికి -
‘నా భార్య, కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు’
బెంగళూరు : భారత పేసర్ అశోక్ దిండాను హేళన చేస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తన అధికారిక ట్విటర్లో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉమేశ్‌ను కొనియాడే క్రమంలో ఆర్సీబీ దిండాను హేళన చేసింది. దిండా అకాడమియే ఏం జరిగిందంటూ? క్యాప్షన్‌గా ఉమేశ్ ఫొటోను ట్వీట్ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ ట్వీట్‌ను తొలిగించింది.ఆర్సీబీ ట్వీట్, ట్రోల్స్‌తో విసిగిపోయిన దిండా.. తన కెరీర్లో అందుకున్న ఘనతలను గుర్తు చేశాడు. ‘హేటర్స్.. నా ఈ లెక్కలు చూడండి. నాపై అనవసరంగా నోరుపారేసుకోవడం ఆపండి. మీ నోటి నుంచి నా పేరు రానివ్వకండి’ అని తాను నమోదు చేసిన గణంకాలను జత చేస్తూ ఆర్సీబీకి గట్టి కౌంటరే ఇచ్చాడు. అయితే తాను అంతలా ఎందుకు స్పందించాల్సి వచ్చిందో అశోక్ దిండా వివరణ ఇచ్చాడు. ‘ ఆర్సీబీ ఫ్రాంచైజీ చేసిన ట్వీట్‌తో నేను చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. మామూలుగా అయితే నేను వాటికి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. కానీ ఆర్సీబీ చేసిన ట్వీట్‌తో నా భార్య, నా కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్ చేశారు. వాడకూడని, వినకూడని భాషతో దూషించారు. కూతుర్ని ఎవరైనా దూషిస్తే బాధ్యత గల తండ్రి ఎవరూ కూర్చొని చూస్తూ ఉండడు. అందుకే ఆర్సీబీ చేసిన ట్వీట్‌కు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అసలు ఆర్సీబీ ఒక ఫ్రాంచైజీ అంటే అనుమానం వస్తుంది. ఒక ఆటగాడ్ని కించపరుస్తూ బాధ్యతలేకుండా ప్రవర్తించిన ఆర్సీబీ ఫ్రాంచైజీగా ఉండేందుకు అర్హత ఉందా’ అని దిండా మరోసారి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. -
క్రికెటర్ దిండా ఆవేదన
బెంగళూరు : భారత పేసర్ అశోక్ దిండాను హేళన చేస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తన అధికారిక ట్విటర్లో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ జట్టు మాజీ ఆటగాడైన దిండా.. ఆర్సీబీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉమేశ్‌ను కొనియాడే క్రమంలో ఆర్సీబీ దిండాను హేళన చేసింది. దిండా అకాడమియే ఏం జరిగిందంటూ? క్యాప్షన్‌గా ఉమేశ్ ఫొటోను ట్వీట్ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ ట్వీట్‌ను తొలిగించింది. ఆర్సీబీ ట్వీట్, ట్రోల్స్‌తో విసిగిపోయిన దిండా.. తన కెరీర్లో అందుకున్న ఘనతలను గుర్తు చేశాడు. ‘హేటర్స్.. నా ఈ లెక్కలు చూడండి. నాపై అనవసరంగా నోరుపారేసుకోవడం ఆపండి. మీ నోటి నుంచి నా పేరు రానివ్వకండి’ అని తాను నమోదు చేసిన గణంకాలను జత చేశాడు. గత 9 సీజన్లుగా బెంగాల్ రంజీ జట్టు తరఫున తానే ఎక్కవ వికెట్లు తీసానని, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మొత్తం 400 వికెట్లు పడగొట్టానని తెలిపాడు. ఇక ఆర్సీబీ సైతం దిండా విషయంలో చేసిన ట్విట్‌పై వివరణ ఇచ్చింది. ‘ మీరు చెప్పినట్లు మేం చేసిన ఆ ట్వీట్ బాలేదు. మీరందరూ ఉమేశ్‌పై ట్రోలింగ్‌కు దిగారు. అతను వాటిని సవాల్‌గా స్వీకరించి (3/36) అదరగొట్టాడు. చివరి ఓవర్లో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.’ అని మరో ట్వీట్ చేసింది. ఇక దిండా మాత్రం ఈ ట్రోలింగ్‌పై తన ఆవేదనను సుదీర్ఘ పోస్టుద్వారా వ్యక్తం చేశాడు. ‘ ఈ ప్రపంచంలో నేను అంత గొప్ప బౌలర్ కాదని తెలుసు. కానీ ఆ ప్రపంచానికి తెలియనిదేంటంటే.. నేను క్రికెటర్ కావడానికి పడ్డ కష్టం. నేను క్రికెటర్‌ను అవుతానంటే నా కుటుంబం అంగీకరించలేదు. మద్దతుగా నిలవలేదు. 9 ఏళ్ల వయసులోనే బెంగాల్ జట్టు తరఫున ఆడాలని కష్టపడ్డాను. ఎన్నో రోజులు ఆహారం లేకుండా క్రికెట్ మైదానాల్లో పడుకున్నాను. నాకు మద్దతివ్వడం మీకు ఇష్టం లేకుంటే వదిలేయండి. కానీ నా ఆటను మాత్రం అవమానించకండి. ఎందుకంటే క్రికెట్ ఆడటానికి రేయింబవళ్లు ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు.’ అని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. భారత జట్టు తరఫున 13 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన దిండా 12 వికెట్లు పడగొట్టాడు. 9 టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. -
బంతి తగిలి విలవిల్లాడిన దిండా
కోల్‌కతా: ప్రాక్టీస్ మ్యాచ్‌లో బెంగాల్ పేసర్ అశోక్ దిండా తీవ్రంగా గాయపడ్డాడు. ఈడెన్ గార్డెన్ వేదికగా బెంగాల్ జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి బౌలింగ్ చేస్తున్న దిండా తలకు బలంగా తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దిండాకు ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలించారు. వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో బెంగాల్ జట్టు ఈడెన్ గార్డెన్లో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలోనే దిండా వేసిన ఒక ఓవర్లో బెంగాల్ ఆటగాడు బిరిందర్ వివేక్ సింగ్ స్ట్రయిట్ డ్రైవ్ కొట్టాడు. ఆ బంతిని తప్పించుకునే ప్రయత్నంలో దిండా తలకు బలంగా తగిలింది. దాంతో దిండా తల పట్టుకుని మైదానంలోనే కూలిపోయాడు. అతనికి అక్కడే చికిత్స చేసిన అనంతరం ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్ చేసిన తర్వాత అతనికి ఎటువంటి ప్రమాదం లేదని తేలడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) ఊపిరిపీల్చుకుంది. అతనికి రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. -
బెంగాల్ పేసర్ అశోక్ దిండాకు తీవ్రంగా గాయాలు
-
అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజాల మధ్య కొట్లాట
న్యూఢిల్లీ: బెంగాల్ రంజీ ఆటగాళ్లు అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజాలు తీవ్రస్థారుులో వాగ్వాదంతో పాటు ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. తమిళనాడుతో జరిగే రంజీ గ్రూప్ లీగ్ మ్యాచ్ కోసం బెంగాల్ ఆటగాళ్లు తమ నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా ఫుట్‌బాల్ ఆడినప్పుడు ఈ సంఘటన జరిగింది. ‘నిజానికి ఇందులో ఓజా తప్పేమీ లేదు. అతడు చాలా నెమ్మదస్తుడు. ఫుట్‌బాల్ ఆడేటప్పుడు దిండా చాలా గట్టిగా బంతిని కిక్ చేశాడు. అది నేరుగా ఓజా చెవుల పక్కనుంచే వెళ్లింది. కొద్దిలో అయితే గాయపడేవాడు. వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిండాపై అరిచాడు. తను దగ్గరికి రావడంతో ఓజా వెనక్కి నెట్టేశాడు. దీంతో కిందపడిన దిండా తిరిగి ఓజా పైకి రాగా ఇతర ఆటగాళ్లు ఇద్దరినీ విడదీశారు’ అని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా గతంలో హైదరాబాద్‌కు ఆడిన ఓజాను ఉద్దేశించి ‘అవుట్ సైడర్’ అని దిండా ఎగతాళి చేసినట్టు సమాచారం. అలాగే కెప్టెన్ మనోజ్ తివారి, కోచ్ సాయిరాజ్ బహుతులే, మేనేజర్ ఆటగాళ్లిద్దరితో మాట్లాడి మరోసారి ఇలాంటి చేష్టలకు దిగితే చర్య తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా విషయాన్ని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఇలాంటివి మంచిది కాదని సూచించారు. గతంలో కూడా దిండా ఇలాగే ఆటగాళ్లతో గొడవకు దిగిన సంఘటనలున్నారుు.