bharathiya janatha party
-
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో స్ట్రెయిట్ టాక్
-
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై రాళ్ల దాడి
కోల్‌కతా: టీమిండియా మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ దిండా కారుపై ఈస్ట్ మిడ్నాపూర్‌లో ఓ దుండగుల గుంపు దాడికి పాల్పడింది. పశ్చిమ బెంగాల్‌లోని మొయినా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న దిండా లక్ష్యంగా మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి తెగబడ్డారు. మొయినా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అతను వెళ్తున్న కారుపై సుమారు 50 మంది రాళ్ళు రువ్వినట్లు సమాచారం. ఈ దాడిలో దిండా తీవ్ర గాయలపాలైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించి, తృణమూల్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని బెంగాల్ బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థుల మధ్య దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడుతూ, రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చదవండి: డక్‌వర్త్ కన్ఫ్యూజన్: కివీస్, బంగ్లా రెండో టీ20లో హైడ్రామా -
మోదీ.. మ్యాజిక్
అహ్మదాబాద్/సిమ్లా/న్యూఢిల్లీ : హోరాహోరీగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ తిరిగి జయకేతనం ఎగురవేసింది. వరుసగా ఆరోసారి విజయఢంకా మోగించింది. అదే సమయంలో రాహుల్ గాంధీ సారథ్యంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా తలపడి బీజేపీకి ముచ్చెమటలు పట్టించింది. మొత్తంగా 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 99 స్థానాలను, కాంగ్రెస్(+) 79 స్థానాలు, ఇతరులు నాలుగు స్థానాలను గెలుచుకున్నారు. మెజారిటీకి అవసరమైన 92 స్థానాలకు మించి సాధించినా.. వంద మార్కును దాటకపోవడం బీజేపీ నేతలు, శ్రేణుల్ని నిరాశపర్చింది. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాల్ని నిజం చేస్తూ బీజేపీ సునాయాసంగా విజయం సాధించింది. కానీ బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధూమల్ ఓటమి పాలవడం ఆ పార్టీని షాక్‌కు గురిచేసింది. మొత్తంగా ఈ రెండు రాష్ట్రాల్లో విజయాలతో బీజేపీ దేశ రాజకీయాలపై మరింత పట్టు బిగించిందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ కూడా తన ఖాతాలో చేరడంతో... మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 19కి చేరింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయమే ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ మరో రాష్ట్రాన్ని కోల్పోయినా.. కొత్త సారథి రాహుల్ నేతృత్వంలో గుజరాత్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం ఆ పార్టీకి ఊరట కలిగించే అంశం. టెన్షన్.. టెన్షన్! సోమవారం ఉదయం 8 గంటలకు గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలుకాగా.. ఆది నుంచి తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ప్రారంభంలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగినా.. కొద్దిసేపటికి కాంగ్రెస్ దూసుకొచ్చింది. ఎగ్జిట్ పోల్ సర్వేల్ని తలకిందులు చేస్తూ ఒక దశలో బీజేపీతో సమానంగా కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చింది. దాంతో స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌లు కూడా వెనకపడడంతో బీజేపీ నేతలు డీలా పడ్డారు. కొద్దిసేపు బీజేపీ, కాంగ్రెస్‌లతో ఫలితాలు దోబూచులాడడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. కానీ ఫలితాలు వెలువడుతున్న కొద్దీ బీజేపీ క్రమంగా ఒక్కో స్థానాన్ని పెంచుకుంటూ.. మెజారిటీ మార్కును దాటింది. చివరకు గుజరాత్లో విజయ ఢంకా మోగించి మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకుగాను 99 స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. ఒక దశలో అధికారానికి దగ్గరకంటూ వచ్చిన కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుచుకొంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 61 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఇక ఎన్సీపీ ఒక స్థానంలో, భారతీయ ట్రైబల్ పార్టీ రెండు చోట్ల గెలవగా.. స్వతంత్రులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఒక దశలో వెనుకంజ వేసిన విజయ్ రూపానీ రాజ్‌కోట్ వెస్ట్ నుంచి 54 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మెహ్సనా నుంచి డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ గెలుపొందారు. కాంగ్రెస్ ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్ రధన్‌పూర్ నుంచి, కాంగ్రెస్ మద్దతుతో దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీ వడ్గాం నుంచి విజయం సొంతం చేసుకున్నారు. ఇక భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) అధ్యక్షుడు ఛోటు వసావా ఝగాడియా స్థానం నుంచి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీటీపీ కాంగ్రెస్‌తో జట్టుకట్టింది. బీజేపీ 48.8 శాతం, కాంగ్రెస్ 41.7 శాతం ఓట్లను సొంతం చేసుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిరూపించుకోగా.. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. సుదూరంలో ‘మిషన్ 150’! 1998 నుంచి గుజరాత్‌ను పాలిస్తున్న బీజేపీ.. 2012లో 116 స్థానాల్లో గెలుపొందగా ఈసారి 17 సీట్లు తగ్గాయి. గెలిచిన ఆనందం ఒకవైపు.. ఆశించినన్ని స్థానాలు రాని నిరాశ మరోవైపు బీజేపీ శ్రేణుల్లో కనిపించింది. 150 స్థానాల్లో గెలుపే లక్ష్యంతో అమిత్‌షా నేతృత్వంలో సాగిన ‘మిషన్ 150’ప్రయోగం సఫలం కాలేదు. సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ గెలుపును ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ ఇద్దరు నేతలు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అటు రాహుల్ కూడా జీఎస్టీ, నోట్ల రద్దు, గుజరాత్ అభివృద్ధి లోపాలపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. గుజరాత్, హిమాచల్‌లో గెలుపు బీజేపీ ఆధిక్యాన్ని, మోదీ ప్రభావాన్ని పెంచినా.. అదే సమయంలో బీజేపీని దీటుగా ఎదుర్కోవడంలో రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని కూడా చాటిచెప్పింది. ఈ ఎన్నికల్లో సీట్ల సంఖ్యను మాత్రమే కాకుండా రెండు శాతం ఓట్లను కూడా కాంగ్రెస్ పెంచుకుంది. పటీదార్, ఓబీసీ, దళిత నేతలైన హర్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకూర్, జిగ్నేశ్ మేవానీల యువ నాయకత్వం కాంగ్రెస్‌కు బాగా సాయపడింది. బీజేపీ చేతికి హిమాచల్ పగ్గాలు హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 44 స్థానాల్లో గెలిచి ఐదేళ్ల అనంతరం మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 21 స్థానాల్లో విజయం సాధించింది. 68 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఓటింగ్ 10 శాతం పెరిగింది. కాంగ్రెస్ ఓట్లు ఒక శాతం తగ్గాయి. హిమచల్ ప్రదేశ్‌ను బీజేపీ తన ఖాతాలో వేసుకున్నా... ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధూమల్ పరాజయం ఆ పార్టీకి నిరాశ మిగిల్చింది. సుజన్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాజీందర్ రానా చేతిలో ధూమల్ పరాజయం చెందారు. ఎన్నికలకు 9 రోజుల ముందు బీజేపీ ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. హిమాచల్‌లో పరాజయంతో కాంగ్రెస్ పార్టీ అధికారం ఇక కర్ణాటక, పంజాబ్, మేఘాలయ, మిజోరం, పుదుచ్చేరిలకే పరిమితం కానుంది. గుజరాత్, హిమాచల్‌లో విజయంతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తాం మాపై ప్రేమ చూపినందుకు ఇరు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వాలకు అభినందనలు. కాంగ్రెస్‌లోని నా సోదర సోదరీమణులు నేను గర్వపడేలా చేశారు. మీపై కోపాన్ని, ద్వేషాన్ని చూపినవారిపై మీరు హుందాగా పోరాటం సాగించారు. కాంగ్రెస్ పార్టీకి హుందాతనం, ధైర్యమే అన్నింటికన్నా గొప్ప బలాలని మీరు తెలియజేశారు. --కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మా సంస్కరణలకు ప్రజామోదం అధికార దాహంతో కాంగ్రెస్ గుజరాత్లో కులతత్వాన్ని వ్యాప్తి చేయాలనుకుంది. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన సంస్కరణలకు ప్రజామోదం ఉందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా దేశం మంచి గుర్తింపు పొందాలంటే అభివృద్ధిలో కొత్త శిఖరాలను అందుకోవాల్సి ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ తప్పుడు పనులకు వ్యతిరేకంగా, అభివృద్ధికి అనుకూలంగానే ప్రజలు ఓటేశారు. -- ప్రధాని మోదీ మోదీకి కేసీఆర్ అభినందన.. గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు అభినందిస్తూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ సందేశం పంపారు. మోదీ మ్యాజిక్..బీజేపీ డబుల్ హ్యాట్రిక్ -
తరాలుగా గుజరాత్‌ను అవమానిస్తున్నారు
కరమ్‌సాద్ : కాంగ్రెస్ పార్టీ మూడు తరాలుగా గుజరాత్‌ను అవమానిస్తూనే ఉందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. స్వతంత్ర భారత్ తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ జన్మస్థలం కరమ్సాద్లో ఆదివారం ఆయన ఇంటిని సందర్శించి నివాళులర్పించిన అనంతరం ‘గుజరాత్ గౌరవ్ యాత్ర’ను షా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ ‘ఇటీవల గుజరాత్‌కు వచ్చిన రాహుల్ గాంధీ బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు. గత మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీ గుజరాత్‌కు చేసిన అన్యాయం గురించి మేం మిమ్మల్ని(కాంగ్రెస్) ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ తొలి తరం(నెహ్రూ) సర్దార్ పటేల్‌కు భారత రత్నతో పాటు తగిన గుర్తింపు ఇవ్వకుండా తీవ్రంగా అవమానించారు. రెండో తరంలో ఇందిరాగాంధీ సీనియర్ గుజరాతీ నేత మొరార్జీ దేశాయ్‌తో అన్యాయంగా ప్రవర్తించారు. మూడో తరంలో సోనియా–రాహుల్ ద్వయం నరేంద్ర మోదీని(గోద్రా అల్లర్ల కేసులో) తీవ్రంగా అవమానించారు. ఈ ఘటనలన్నింటిపై రాహుల్ జవాబు కోసం గుజరాత్ ప్రజలు ఎదురుచూస్తున్నారు’ అని షా అన్నారు. గుజరాత్ అభివృద్ధి నమూనాను అవహేళన చేసేవారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని షా హెచ్చరించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అక్టోబర్ 1 నుంచి 15 వరకు జరిగే ‘గుజరాత్ గౌరవ్ యాత్ర’ రెండు వేర్వేరు మార్గాల్లో సమాంతరంగా సాగనుంది. ఈ యాత్ర ముగింపు కార్యక్రమంలో షాతో పాటు ప్రధాని మోదీ కూడా పాల్గొననున్నారు. -
విలీనము.. విమోచనము.. రెండూ కాదు
పంజగుట్ట: తెలంగాణలో భారతీయ జనతాపార్టీ ప్రాబల్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తోందని, అందుకే తెలంగాణ విమోచన దినం అని వాదనలు వినిపిస్తున్నారని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. సెప్టెంబర్ 17 హైదరాబాద్ విలీనం కాదు, విమోచన దినం కాదని వారు పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమాఖ్య కో కన్వీనర్ డాక్టర్ కొల్లూరి చిరంజీవి, కన్వీనర్ ఆరీఫుద్దీన్, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావులు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీకి ఎంఐఎంతో ఏదైనా విబేధాలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కాని హైదరాబాద్ చరిత్ర వక్రీకరించకూడదని అన్నారు. టీఆర్ఎస్ ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని లేకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని హితవుపలికారు. ప్రొఫెసర్ కోదండరామ్ విలీనదినమని అంటున్నారని దాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు. లైబ్రరీలో ఎన్నో చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో అబ్దుల్ సత్తార్ ముజాహిద్, శ్రీరామ్, ఫసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ను తప్పుపట్టవద్దన్న జైపాల్
పార్లమెంట్లో ఏం జరిగింది -5 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన ఫిబ్రవరి 18, 2014న లోక్‌సభలో జరిగిన సన్నివేశాల కొనసాగింపును ఇప్పుడు చూద్దాం. సీమాంధ్రకు చెందిన భారతీయ జనతా పార్టీ కార్య కర్తలూ, నాయకులూ హైదరాబాద్‌తో సహా తెలంగాణ వేర్పాటు కోరుకుంటున్నారని, మరే పార్టీ కోరుకోవటం లేదని సుష్మాస్వరాజ్ గారు చెప్పారు.‘‘హోంమంత్రిగారు మాట చెప్తే కాదు. లోటు భర్తీకి కేటాయింపు జరపాలి’’ అని కూడా అన్నారు. అంతకు ముందు రోజే ‘ఓట్ ఆన్ అకౌంట్’ చేసేసి దుకాణం మూసేశాక, కొత్త కేటాయింపులు జరపలేరని ఆవిడకు తెలియక చెప్పింది కాదు ‘ఇన్‌టర్మ్ బడ్జెట్’ అంటూ మరోమాట కూడా అన్నారు. 21వ తారీఖున 15వ లోక్‌సభే కాలం చెల్లిపోతుంటే... ఎందుకీ మాట అన్నట్లు...? పోలవరం ప్రాజెక్టు గురించి, మండలాల గురించి జైరాం రమేష్ గారికి వెంకయ్య నాయుడు గారికి ఒప్పందం కుదిరిందని సంబంధిత ఉత్తరం కూడా ఉందని సుష్మా స్వరాజ్ గారు అన్నారు! తప్పుడు బిల్లు ఎందుకు పాస్ చేయిస్తున్నారంటూ ప్రశ్నించారు కూడా... రండి రాజ్యాంగ సవరణ చేసి సరైన బిల్లు పాస్ చేద్దాం అని కూడా అన్నారు. నిజంగా రాజ్యాంగ సవరణ బిల్లు తెస్తే, మూడింట రెండొంతులు మెజారిటీతో అది ‘పాస్’ అవు తుందా? సాధారణ మెజారిటీతోనే పాసయ్యే పరిస్థితి లేకే టెలికాస్ట్ ఆపుచేసి తలుపులు మూసేసి, ‘డివిజన్’ చేయకుండా ‘మాయ’ చేస్తున్నారని ఆవిడకి తెలియదా!? పాపం షానవాజ్ హుస్సేన్ గారికి ఈ ‘కుట్ర’ తెలిసుండదు. - టీవీ ప్రసారాలు ఎందుకాపేశారు... ఎందుకాపేశారు అంటూ విరుచుకుపడ్డారు! ‘ఇదీ కథ’ అని బీజేపీ అగ్రనాయకులు చెప్పి ఉంటారు... మళ్లీ నోరిప్పలేదాయన!! - ప్రతిపక్షంలోని మిగిలిన అన్ని పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయని, అయినా బీజేపీ ఒక్కటే ఈ బిల్లును సపోర్టు చేస్తున్నదని సాక్షాత్తూ ప్రతిపక్ష నాయకురాలైన సుష్మా స్వరాజ్ గారే ప్రకటించటం గమనార్హం! - 15.10: జైపాల్‌రెడ్డి: ఈ డిమాండ్ గత 60 సంవత్సరాలుగా లేవనెత్తబడుతోందని గుర్తు చేస్తున్నాను. దేశచరిత్రలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంతటి దీర్ఘకాలిక అలజడితో కూడిన డిమాండ్ మరొకటి లేదనుకుంటా. ఈరోజు, ఇంతటి పవిత్రమైన, ఆనంద దాయకమైన సందర్భంలో మనమంతా ఇలాంటి క్రమశిక్షణ లేని దృశ్యంలో ఉండటం, ఆశ్చర్యం-బాధాకరం. - మిత్రులారా! 2004 యూపీఏ మేనిఫెస్టోలో ఈ డిమాండ్ ఉల్లేఖించబడింది. 2004 అధ్యక్షోపన్యాసంలో ఒప్పుకోబడింది. నేను నా ఆంధ్ర మిత్రులని అడుగుతున్నా. ఇన్నాళ్లూ ఏం చేశారు? కుంభకర్ణుల్లా నిద్రపోతున్నారా... సుష్మాస్వరాజ్ గారికి, మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూనే కాంగ్రెస్‌ను తప్పు పట్టవద్దని కోరుతున్నా. ఈ గొప్ప సందర్భం కోసం కాంగ్రెస్ పునాదులు తయారు చేస్తూ వచ్చింది. ఎన్నికల్లో లబ్ధి కోసం వారు చేస్తున్నారని మీరంటున్నారు. - మేడమ్, 2009 డిసెంబర్ 9న నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నికలున్నాయా? అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో ఉన్న సీమాంధ్ర మంత్రులు ఏం చేస్తున్నారు.... నిరసన వ్యక్తం చేశారా? ఇప్పుడెందుకు తొందరపాటు నిరసనలు? - గత 45 సంవత్సరాలుగా బీజేపీ తెలంగాణ డిమాండ్‌ను సమర్థించింది. నేను మొట్టమొదటిసారి 1969లో ‘కాడెద్దులు’ గుర్తుతో ఎన్నికలో గెలిచాను. నేనా ఒరిజినల్ కాంగ్రెస్‌లో ఒకడిని. 1969లోనే తెలంగాణ ఉద్యమం కూడా ప్రారంభమయ్యింది. బీజేపీ, పూర్వజన్మలో భారతీయ జనసంఘ్, అప్పుడూ తెలంగాణను సపోర్టు చేసింది. అప్పట్నుంచీ సపోర్టు చేస్తూనే వచ్చింది. బీజేపీలోనే కాక, దేశంలోనే అతి పెద్ద రాజ నీతిజ్ఞుడు అయిన అద్వానీ గారి వ్యతిరేక స్వరం విని నేను నిశ్చేష్టుడనయ్యాను. ఏది ఏమైనప్పటికీ సుష్మాస్వరాజ్గారు వ్యక్తిగత హోదాలోనైనా మద్దతుగా మాట్లాడినం దుకు ధన్యవాదాలు. - ‘విశాలాంధ్ర’ అనే పత్రిక ఉన్నప్పటికీ, మునుపటి రోజుల్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకించినప్పటికీ,ఇప్పుడు తెలంగాణకు మద్దతు తెలుపుతున్న కమ్యూనిస్టు పార్టీ వారికి అభినందనలు. - ఈ అద్భుతమైన ప్రయోజనం సిద్ధించడానికి ప్రధాన కారకులు ఒకే వ్యక్తి, ఒకే మహిళ, సోనియా గాంధీ. నేను సోనియాజీతో సన్నిహితంగా 15 ఏళ్లు పనిచేశాను. స్పీకర్: ఆల్రైట్ జైపాల్‌రెడ్డిగారూ... దయచేసి ముగించండి! జైపాల్: ఆమెకు అంతర్జాతీయ అవగాహన ఉంది. ఆమె ఏనాడు సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు? ఈ సందర్భంలో నేను తెలంగాణ ప్రజల తరఫున ఒకమాట చెప్తున్నా. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టంలో మేము ఏనాడూ సీమాంధ్ర ప్రజలను వివక్షతో చూడం. మనందరికీ తెలిసిందే... చివరాఖరికి మనమంతా తెలుగువాళ్లం. మనమంతా భారతీయులం. భారత రాజ్యాంగం చేత పాలించబడుతున్న వాళ్లం. స్పీకర్: ఆల్రైట్...ఓకే... దయచేసి ముగించండి! జైపాల్: ఈ సందర్భంగా సోనియాగాంధీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియ చేస్తూ సీమాంధ్ర ప్రజలకు నమ్మకంగా చెప్తున్నా... హైదరాబాద్‌లో సీమాంధ్ర వారిని ఎవరైనా వేరుగా చూస్తే తలదించుకునేవాళ్లలో నేను మొదటివాడినవుతా. స్పీకర్: జైపాల్‌రెడ్డిగారూ! దయచేసి ముగించండి! స్పీకర్: ఆల్రైట్ థ్యాంక్యూ. జైపాల్: నేనింకెంతో కాలం ఉండను. ఉన్నకాలంలో నాకి వ్వబడిన సమయంలో సీమాంధ్ర ప్రజల రక్షణ కోసం నన్ను నేను అంకితం చేసుకుంటున్నా. థ్యాంక్యూ. స్పీకర్: థ్యాంక్యూ సో మచ్. ఎవరైనా మాట్లాడాలనుకున్నవాళ్లు రాసుకొచ్చిన ఉపన్యాసాలను ‘టేబుల్’ చెయ్యండి. ఇక ప్రొసీడ్ అవుతాను. పార్లమెంటులో అన్ని పార్టీల సభ్యులూ సమానంగా గౌరవించే మేధావి జైపాల్ రెడ్డి గారు. ఆయన మాట్లాడుతుంటే స్పీకర్ గారు ‘ఇక ముగించండి, ఇక ముగించండి’ అంటూ అడ్డుతగలడం - బహుశా ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇదే మొదటి సారి అయి ఉంటుంది. ఇన్నాళ్లూ ‘కుంభకర్ణుల్లా నిద్రపోతున్నారా’ అని ఆంధ్రా మిత్రుల్ని ప్రశ్నించారు జైపాల్‌రెడ్డిగారు. నిజానికి 2004 ఎన్నికల మేనిఫెస్టోలో రెండవ ఎస్సార్సీ (స్టేట్స్ రి-ఆర్గనైజేషన్ కమిషన్) వేస్తామని చెప్పింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి చేత తెలంగాణ విషయమై ఈ కింది మాటలు చెప్పించింది యూపీఏ ప్రభుత్వం. ‘‘సరైన సమయంలో, తగు సంప్రతింపుల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’’. ఇక 2009లో చిదంబరం తెలంగాణ ప్రకటన తర్వాత సీమాంధ్ర భగ్గుమంది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని శ్రీకృష్ణ కమిషన్‌ను నియమించింది. ‘అద్వానీగారు వ్యతిరేక స్వరం విని నిశ్చేష్టుడనయ్యాను’ అన్నారు జైపాల్‌రెడ్డి. ‘‘రాష్ట్ర విభజన రాబోయే ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మూడు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగబోతోంది. ఎందుకీ అల్లకల్లోలంలో హడావిడి నిర్ణయం. ఓట్ ఆన్ ఎకౌంట్ పూర్తి చేసి 15వ లోక్‌సభను ముగించండి’’ అని అద్వానీ గారు కోరిన విషయం సర్వ విదితమే. దీనినే జైపాల్‌రెడ్డి ప్రస్తావిస్తూ ‘వ్యతిరేక స్వరం’ అన్నారు. అరవై ఏళ్లుగా నలుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మీద చర్చ ముగిసి పోయింది. ఇద్దరే ఇద్దరు పాల్గొన్నారు. సుష్మా స్వరాజ్, జైపాల్‌రెడ్డి. ఇంకెవ్వరైనా మాట్లాడాలనుకుంటే, వారి ఉపన్యాసాల వ్రాతప్రతులు ‘టేబుల్’ చెయ్యండి... (అంటే స్పీకర్ ముందు కూర్చునే సెక్రటరీకి అందచెయ్యమని) అన్నారు. బోడో ఫ్రంట్‌కు చెందిన సంసుమకునగ్గర్ బిశ్వమూర్రియర్ , శైలేంద్రకుమార్, దారాసింగ్, సౌగత్‌రాయ్ పునియా, సుదీప్ బందోపాధ్యాయ, మహేంద్రసింగ్ చౌహాన్, కిరీటి ప్రేమ్‌జీ భాయ్ సోలంకి, అర్జునరామ్ మేఘవాల్, గురుదాస్ దాస్ గుప్తాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పనబాక లక్ష్మి, బొత్స ఝాన్సీ, మధు యాష్కీ, సురేశ్ షట్కర్, పొన్నం ప్రభాకర్, జి. వివేకానందలు కూడా తమ స్పీచ్‌లు ‘టేబుల్’ చేశారు. ఇవన్నీ పార్లమెంట్ రికార్డుల్లో నమోదు చేయబడ్డాయి. 12-11-1962న డాక్టర్ జీఎస్ మేల్కోటే అనే లోక్‌సభ సభ్యుడు తను వ్రాసు కొచ్చిన ‘స్పీచ్’ని టేబుల్ చేస్తానంటే అప్పటి స్పీకర్ ‘అలా చేయటానికి వీలులేదని రూలింగ్ ఇచ్చారు! ఆ రూలింగ్ కూడా ‘బ్రేక్’ చేయబడింది. - వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు - ఉండవల్లి అరుణ్‌కుమార్ a_vundavalli@yahoo.com -
కమలం గూటికి పాయల శంకర్..?
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, గత ఉప ఎన్నికల టీడీపీ అభ్యర్థి పాయల శంకర్ భారతీయ జనతాపార్టీ వైపు దృష్టి సారిస్తున్నారు. సైకిల్‌ను వీడి కమల దళంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా పాయల శంకర్ పేరును మొట్టమొదటగా ఖరారు చేశారు. అయితే తెలంగాణపై చంద్రబాబు వైఖరితో ఓవైపు కేడర్‌లో నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటుండగా.. మరోవైపు నేతలు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వడివడిగా అడుగులు వేస్తున్నారు. పాయల శంకర్ కూడా తన రాజకీయ సుస్థిరత కోసం టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలతో మంతనాలు.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీడీపీ రెండుకళ్ల సిద్ధాంతాన్ని తెలంగాణవాదులు మొదటి నుం చీ వ్యతిరేకించారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత చంద్రబాబు మరోసారి తెలంగాణపై తన వ్యతిరేక వైఖరిని స్పష్టం చేయడం తో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ‘కట్టె కాలేదాక వేచిచూడకుండా’ తమ దారేదో తాము చూసుకోవాలని లేనిపక్షంలో తెలంగాణలో టీడీపీ ఉణికి లేకుండాపోయి తమ రాజకీయ అస్తిత్వానికే దారి తీస్తుందనే బెంగ జిల్లాలోని టీడీపీ నా యకుల్లో కొంతకాలంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో పాయల శంకర్ టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నారని పలుమార్లు ఊహాగానాలు వచ్చి నా ఆయన కొట్టిపారేశారు. ఇటీవల నిర్మల్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమ య్య కుమారుడి వివాహానికి నిజామాబాద్ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ, బీజే పీ రా ష్ట్ర నేతలు బద్దం లింగారెడ్డి, ఆలూరి గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యా రు. వివాహ శుభ కార్యక్రమంలో పాల్గొన్న పా యల శంకర్ అక్కడే బీజేపీ రాష్ట్ర నేతలతో మం తనాలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం నిజామాబాద్‌లో బీజేపీ రాష్ట్ర నేతలను కలిసిన పాయల పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతూ దాదాపు రెండు గంటల పాటు మం తనాలు సాగించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ టికెట్ తనకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర నేతల సమక్షంలోనే బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో ఫోన్లో సం భాషణ జరిపారనేది సమాచారం. బీజేపీ నుంచి కూడా సానుకూలత వ్యక్తమైనట్లు పాయ ల శం కర్కు ముఖ్య అనుచరుడిగా ఉన్న ఓ నేత ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా బీజేపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ సుశ్మస్వరాజ్ బిజీగా ఉన్న దృష్ట్యా పార్లమెంట్ సెషన్ తర్వాత ఆమె రాష్ట్రంలో పర్యటించే అవకాశాలున్నాయని, అదే సందర్భంలో బీజేపీలో చేరేందుకు పాయల సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాయల శంకర్ అనంగు అనుచరుడొకరు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పాయల శంకర్‌తో కలిసి బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.