ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి, గత ఉప ఎన్నికల టీడీపీ అభ్యర్థి పాయల శంకర్ భారతీయ జనతాపార్టీ వైపు దృష్టి సారిస్తున్నారు. సైకిల్‌ను వీడి కమల దళంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా పాయల శంకర్ పేరును మొట్టమొదటగా ఖరారు చేశారు. అయితే తెలంగాణపై చంద్రబాబు వైఖరితో ఓవైపు కేడర్‌లో నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటుండగా.. మరోవైపు నేతలు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వడివడిగా అడుగులు వేస్తున్నారు. పాయల శంకర్ కూడా తన రాజకీయ సుస్థిరత కోసం టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ నేతలతో మంతనాలు..
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీడీపీ రెండుకళ్ల సిద్ధాంతాన్ని తెలంగాణవాదులు మొదటి నుం చీ వ్యతిరేకించారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత చంద్రబాబు మరోసారి తెలంగాణపై తన వ్యతిరేక వైఖరిని స్పష్టం చేయడం తో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ‘కట్టె కాలేదాక వేచిచూడకుండా’ తమ దారేదో తాము చూసుకోవాలని లేనిపక్షంలో తెలంగాణలో టీడీపీ ఉణికి లేకుండాపోయి తమ రాజకీయ అస్తిత్వానికే దారి తీస్తుందనే బెంగ జిల్లాలోని టీడీపీ నా యకుల్లో కొంతకాలంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో పాయల శంకర్ టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నారని పలుమార్లు ఊహాగానాలు వచ్చి నా ఆయన కొట్టిపారేశారు. ఇటీవల నిర్మల్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమ య్య కుమారుడి వివాహానికి నిజామాబాద్ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ, బీజే పీ రా ష్ట్ర నేతలు బద్దం లింగారెడ్డి, ఆలూరి గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యా రు.
వివాహ శుభ కార్యక్రమంలో పాల్గొన్న పా యల శంకర్ అక్కడే బీజేపీ రాష్ట్ర నేతలతో మం తనాలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం నిజామాబాద్‌లో బీజేపీ రాష్ట్ర నేతలను కలిసిన పాయల పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతూ దాదాపు రెండు గంటల పాటు మం తనాలు సాగించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ టికెట్ తనకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర నేతల సమక్షంలోనే బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో ఫోన్‌లో సం భాషణ జరిపారనేది సమాచారం. బీజేపీ నుంచి కూడా సానుకూలత వ్యక్తమైనట్లు పాయ ల శం కర్‌కు ముఖ్య అనుచరుడిగా ఉన్న ఓ నేత ద్వారా విశ్వసనీయంగా తెలిసింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా బీజేపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ సుశ్మస్వరాజ్ బిజీగా ఉన్న దృష్ట్యా పార్లమెంట్ సెషన్ తర్వాత ఆమె రాష్ట్రంలో పర్యటించే అవకాశాలున్నాయని, అదే సందర్భంలో బీజేపీలో చేరేందుకు పాయల సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాయల శంకర్ అనంగు అనుచరుడొకరు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పాయల శంకర్‌తో కలిసి బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
కమలం గూటికి పాయల శంకర్..?
Published Sun, Dec 8 2013 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement