payala shankar
-
‘అతన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి’
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్‌ను వెంటనే పార్టీ నుంచి తొలగించాలని జిల్లా బీజీపీ కార్యవర్గం సోమవారం డిమాండ్ చేసింది. జిల్లా కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి ఆధ్యర్యంలో ఆదిలాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. పాయల్ శంకర్ ఇతర పార్టీకి అమ్ముడు పోవటం వల్ల ఆదిలాబాద్ మున్సిపాలిటీ చేజారిందని ఆమె ఆరోపించారు. కేవలం మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాదు.. తన స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లాలో పార్టీని బలహీనపరుస్తున్నాడని ఆమె మండిపడ్డారు. పాయల్ శంకర్‌ను వెంటనే జిల్లా అధ్యక్షుడి పదవీ నుంచి తొలగించి, సస్పెండ్ చేయాలని అధిష్టానాన్ని జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. లేదంటే ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కార్యవర్గమంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని పార్టీ అధిష్టానానికి అల్టిమేటంజారీ చేసింది. -
పొత్తు చిత్తవుతోంది!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : టీడీపీ, బీజేపీ జాతీయ రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు కలిసి పనిచేయలేకపోతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ప్రచారంలో బీజేపీ నాయకులు పాల్గొనడం లేదు. బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో టీడీపీ శ్రేణులు దూరంగా ఉంటున్నాయి. పలు నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నేతల పరస్పర సహకారం కొరవడడంతో పొత్తు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందనే భావన వ్యక్తమవుతోంది. పొత్తుల్లో భాగంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానం టీడీపీకి దక్కగా, ఎమ్మెల్యే స్థానం బీజేపీకి కేటాయించారు. ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి పాయల శంకర్ మధ్య తీవ్ర విభేదాలున్నాయి. పాయల టీడీపీలో ఉండగా ఈ విభేదాలు తలెత్తాయి. ఆదిలాబాద్ ఉప ఎన్నికల కోసం టీడీపీ నుంచి వచ్చిన పార్టీ ఫండ్ పంపకాల్లో వీరికి తేడాలు రావడంతో ఈ విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రెండు పార్టీల పొత్తు కారణంగా వారిద్దరు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా, వీరు కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం లేదు. పైగా టీడీపీ పట్టణాధ్యక్షుడు మునిగెల నర్సింగ్‌ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలపడం వెనుక రాథోడ్ జిమ్మిక్కు ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బోథ్‌లో ఉమ్మడి అభ్యర్థి సోయం బాపూరావు చేస్తున్న ఎన్నికల ప్రచారానికి కూడా నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణులు దూరంగా ఉంటున్నాయి. మంగళవారం రెండు పార్టీల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీకి దక్కినా ముథోల్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి రమాదేవి ప్రచారానికి టీడీపీ నాయకులు దూరంగా ఉన్నారు. పార్టీ టిక్కెట్ ఆశించిన నారాయణరెడ్డి, నామినేషన్ వేసిన లడ్డా తదితర నేతలు బీజేపీ ప్రచారంలో పాల్గొనడం లేదు. టీడీపీ శ్రేణులు దూరంగా ఉండటంతో చెన్నూరులో బీజేపీ అభ్యర్థి రాంవేణు ఒంటరిగానే ప్రచారం చేస్తున్నారు. మంచిర్యాల స్థానం కూడా బీజేపీకి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు ఏకంగా పార్టీకే దూరమయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి సత్యం తెరమరుగయ్యారు. దీంతో బీజేపీ అభ్యర్థి మల్లారెడ్డి బీజేపీ శ్రేణులతోనే ప్రచారం నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీకి దక్కిన నిర్మల్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి మీర్యాసిన్బేగ్ ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, జిల్లా అధ్యక్షుడు అయ్యనగారి భూమయ్య వంటి ముఖ్య నాయకులున్నారు. టీడీపీకి దక్కిన బెల్లంపల్లి అభ్యర్థి పాటి సుభద్రకు కూడా టీడీపీ శ్రేణులు అంతగా సహకరించడం లేదు. మొత్తం మీదా రెండు పార్టీల శ్రేణులు కలిసి ప్రజల్లోకి వెళ్లలేకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. -
నామినేషన్ల జోరు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : లోక్‌సభ, శాసనసభ స్థానాలకు అన్ని పార్టీల్లో అభ్యర్థులు ఖరారవుతుండటంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మూడో రోజైన శుక్రవారం తొమ్మిది నియోజకవర్గాలకు 17 నామినేషన్లు దాఖలు కా గా, నిర్మల్ నియోజకవర్గానికి నామినేషన్లు రాలేదు. సిర్పూర్ నియోజకవర్గానికి టీడీపీ నుంచి రావి శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ నుంచి కావేటి సమ్మయ్య, చెన్నూర్‌కు టీడీపీ నుంచి దుర్గం నరేష్, బెల్లంపల్లికి టీడీపీ నుంచి పాటి సుభద్ర, మంచిర్యాలకు కాంగ్రెస్ నుంచి గడ్డం అరవింద రెడ్డి, టీడీపీ నుంచి కొండేటి సత్యనారాయణ, టీడీపీ నుంచి మురళీధర్, ఆసిఫాబాద్ స్థానానికి టీఆర్ఎస్ నుంచి కోవ లక్ష్మి, ఖానాపూర్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి అజ్మీర హరినాయక్, స్వతంత్ర అభ్యర్థిగా జాదవ్ బొజ్జ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. అదే స్థానానికి టీఆర్ఎస్ నుంచి అజ్మీర రేఖాశ్యాంనాయక్ రెండు సెట్లు నామినేషన్ వేశారు. ఆదిలాబాద్‌కు టీఆర్ఎస్ నుంచి జోగు రామన్న, బీజేపీ నుంచి పాయ ల శంకర్ నామినేషన్ వేశారు. బోథ్‌కు టీఆర్ఎస్ నుంచి రాథోడ్ బాపురావు వేశారు. ముథోల్‌కు కాంగ్రెస్ నుంచి విఠల్‌రెడ్డి నామినేషన్ వేయగా, ఈయనే స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్ దాఖలు చేశా రు. సిర్పూర్ నియోజకవర్గానికి 2, చెన్నూర్‌కు 1, బెల్లంపల్లికి 1, మంచిర్యాలకు 3, ఆసిఫాబాద్‌కు 1, ఖానాపూర్‌కు 4, ఆదిలాబాద్‌కు 2, బోథ్‌కు 1, ముథోల్‌కు 2 చొప్పున నామినేషన్లు వచ్చాయి. -
కమలం గూటికి పాయల శంకర్..?
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, గత ఉప ఎన్నికల టీడీపీ అభ్యర్థి పాయల శంకర్ భారతీయ జనతాపార్టీ వైపు దృష్టి సారిస్తున్నారు. సైకిల్‌ను వీడి కమల దళంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన చంద్రబాబు 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా పాయల శంకర్ పేరును మొట్టమొదటగా ఖరారు చేశారు. అయితే తెలంగాణపై చంద్రబాబు వైఖరితో ఓవైపు కేడర్‌లో నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటుండగా.. మరోవైపు నేతలు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వడివడిగా అడుగులు వేస్తున్నారు. పాయల శంకర్ కూడా తన రాజకీయ సుస్థిరత కోసం టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలతో మంతనాలు.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీడీపీ రెండుకళ్ల సిద్ధాంతాన్ని తెలంగాణవాదులు మొదటి నుం చీ వ్యతిరేకించారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత చంద్రబాబు మరోసారి తెలంగాణపై తన వ్యతిరేక వైఖరిని స్పష్టం చేయడం తో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ‘కట్టె కాలేదాక వేచిచూడకుండా’ తమ దారేదో తాము చూసుకోవాలని లేనిపక్షంలో తెలంగాణలో టీడీపీ ఉణికి లేకుండాపోయి తమ రాజకీయ అస్తిత్వానికే దారి తీస్తుందనే బెంగ జిల్లాలోని టీడీపీ నా యకుల్లో కొంతకాలంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో పాయల శంకర్ టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నారని పలుమార్లు ఊహాగానాలు వచ్చి నా ఆయన కొట్టిపారేశారు. ఇటీవల నిర్మల్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమ య్య కుమారుడి వివాహానికి నిజామాబాద్ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ, బీజే పీ రా ష్ట్ర నేతలు బద్దం లింగారెడ్డి, ఆలూరి గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యా రు. వివాహ శుభ కార్యక్రమంలో పాల్గొన్న పా యల శంకర్ అక్కడే బీజేపీ రాష్ట్ర నేతలతో మం తనాలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం నిజామాబాద్‌లో బీజేపీ రాష్ట్ర నేతలను కలిసిన పాయల పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతూ దాదాపు రెండు గంటల పాటు మం తనాలు సాగించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ టికెట్ తనకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర నేతల సమక్షంలోనే బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో ఫోన్లో సం భాషణ జరిపారనేది సమాచారం. బీజేపీ నుంచి కూడా సానుకూలత వ్యక్తమైనట్లు పాయ ల శం కర్కు ముఖ్య అనుచరుడిగా ఉన్న ఓ నేత ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా బీజేపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ సుశ్మస్వరాజ్ బిజీగా ఉన్న దృష్ట్యా పార్లమెంట్ సెషన్ తర్వాత ఆమె రాష్ట్రంలో పర్యటించే అవకాశాలున్నాయని, అదే సందర్భంలో బీజేపీలో చేరేందుకు పాయల సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాయల శంకర్ అనంగు అనుచరుడొకరు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పాయల శంకర్‌తో కలిసి బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.