
ఫైల్ ఫోటో
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్‌ను వెంటనే పార్టీ నుంచి తొలగించాలని జిల్లా బీజీపీ కార్యవర్గం సోమవారం డిమాండ్ చేసింది. జిల్లా కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి ఆధ్యర్యంలో ఆదిలాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. పాయల్ శంకర్ ఇతర పార్టీకి అమ్ముడు పోవటం వల్ల ఆదిలాబాద్ మున్సిపాలిటీ చేజారిందని ఆమె ఆరోపించారు. కేవలం మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాదు.. తన స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లాలో పార్టీని బలహీనపరుస్తున్నాడని ఆమె మండిపడ్డారు. పాయల్ శంకర్‌ను వెంటనే జిల్లా అధ్యక్షుడి పదవీ నుంచి తొలగించి, సస్పెండ్ చేయాలని అధిష్టానాన్ని జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. లేదంటే ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కార్యవర్గమంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని పార్టీ అధిష్టానానికి అల్టిమేటంజారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment