కలెక్టరేట్, న్యూస్‌లైన్ : లోక్‌సభ, శాసనసభ స్థానాలకు అన్ని పార్టీల్లో అభ్యర్థులు ఖరారవుతుండటంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మూడో రోజైన శుక్రవారం తొమ్మిది నియోజకవర్గాలకు 17 నామినేషన్లు దాఖలు కా గా, నిర్మల్ నియోజకవర్గానికి నామినేషన్లు రాలేదు. సిర్పూర్ నియోజకవర్గానికి టీడీపీ నుంచి రావి శ్రీనివాస్‌రావు, టీఆర్‌ఎస్ నుంచి కావేటి సమ్మయ్య, చెన్నూర్‌కు టీడీపీ నుంచి దుర్గం నరేష్, బెల్లంపల్లికి టీడీపీ నుంచి పాటి సుభద్ర, మంచిర్యాలకు కాంగ్రెస్ నుంచి గడ్డం అరవింద రెడ్డి, టీడీపీ నుంచి కొండేటి సత్యనారాయణ, టీడీపీ నుంచి మురళీధర్, ఆసిఫాబాద్ స్థానానికి టీఆర్‌ఎస్ నుంచి కోవ లక్ష్మి, ఖానాపూర్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి అజ్మీర హరినాయక్, స్వతంత్ర అభ్యర్థిగా జాదవ్ బొజ్జ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు.
అదే స్థానానికి టీఆర్‌ఎస్ నుంచి అజ్మీర రేఖాశ్యాంనాయక్ రెండు సెట్లు నామినేషన్ వేశారు. ఆదిలాబాద్‌కు టీఆర్‌ఎస్ నుంచి జోగు రామన్న, బీజేపీ నుంచి పాయ ల శంకర్ నామినేషన్ వేశారు. బోథ్‌కు టీఆర్‌ఎస్ నుంచి రాథోడ్ బాపురావు వేశారు. ముథోల్‌కు కాంగ్రెస్ నుంచి విఠల్‌రెడ్డి నామినేషన్ వేయగా, ఈయనే స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్ దాఖలు చేశా రు. సిర్పూర్ నియోజకవర్గానికి 2, చెన్నూర్‌కు 1, బెల్లంపల్లికి 1, మంచిర్యాలకు 3, ఆసిఫాబాద్‌కు 1, ఖానాపూర్‌కు 4, ఆదిలాబాద్‌కు 2, బోథ్‌కు 1, ముథోల్‌కు 2 చొప్పున నామినేషన్లు వచ్చాయి.
నామినేషన్ల జోరు
Published Sat, Apr 5 2014 12:45 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement