కోల్‌కతా: రసవత్తరంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్‌లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. బీజేపీ నాయకుడు సువేందు అధికారిపై 1200 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు దీదీ. నందిగ్రామ్ ఫలితం అనంతరం మమత మీడియాతో మాట్లాడారు. ఇది బెంగాల్ ప్రజల విజయం అన్నారు. తనను గెలిపించిన బెంగాల్ ప్రజలకు దీదీ కృతజ్ఞతలు తెలిపారు. విజయం ముఖ్యం కాదు.. కరోనాను ఎదుర్కొవడమే ప్రధానం అన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని సూచించారు. తన తదుపరి పోరాటం కోవిడ్ మీదనే అన్నారు దీదీ.
ఇక నందిగ్రామ్ బరిలో మమత కేవలం 1,200 స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇక పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం టీఎంసీ 215 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 74 చోట్ల ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment