
కోల్‌కతా: ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలోకి బీజేపీ పెద్ద ఎత్తున బయటి వ్యక్తులను తీసుకువ చ్చిందని, అందువల్ల రాష్ట్రంలో కరోనా కేసులు పె రుగుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. జల్‌పయిగురిలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు కూడా కేంద్రం సహకరించడం లేదన్నారు. మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించడంపై తనకు 24 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించడంపై స్పందిస్తూ.. ‘హిందువులు, ముస్లింలు, అందరూ ఓటేయాలని కోరడం తప్పా? ప్రతీ సభలో నన్ను అవమానిస్తున్న ప్రధాని మోదీని ప్రచారం నుంచి ఎందుకు బహిష్కరించడంలేదు?’ అని ప్రశ్నిం చారు. మమత బెనర్జీకి వీడ్కోలు పలికేందుకు సమయం ఆసన్నమైందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.
కూచ్‌బెహార్ జిల్లాలో కాల్పుల్లో మరణించిన
ఓ బాధితుడి కుటుంబాన్ని ఓదార్చి, వారి బిడ్డను లాలిస్తున్న మమతా బెనర్జీ
Comments
Please login to add a commentAdd a comment