కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం తమ మేనిఫెస్టో విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు ఐదు లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఇంటింటికీ రేషన్ అందిస్తామని, ఎస్సీ, ఎస్టీలకు 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రతి ఏటా రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని రూ. 6 వేల నుంచి 10 వేలకు పెంచుతామని వాగ్దానం చేశారు.
ఇక ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం 4 శాతం వడ్డీతో రూ. 10 లక్షల లిమిట్‌తో క్రెడిట్ కార్డు ఇస్తామని మమత పేర్కొన్నారు. అదే విధంగా, వెనుకబడిన, పేద వర్గాలకు రూ. 6 వేల నుంచి రూ. 12 వేల వరకు కనీస వార్షికాదాయం ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు.
పటిష్టమైన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికై మమత 10 వాగ్దానాలు
►ప్రతి ఏటా ఐదు లక్షల ఉద్యోగాల కల్పన
►అదనంగా 10 లక్షల ఏటా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్ల ఏర్పాటు
►రానున్న ఐదేళ్లలో 2 వేల పెద్ద పరిశ్రమల ఏర్పాటు
►1.6 కోట్ల ఇంటి మహిళా యజమానులకు నెలవారీగా రూ. 500(జనరల్ కేటగిరీ), రూ. 1000 (ఎస్సీ,ఎస్టీలకు) అందజేత
►వైద్య రంగానికి పెద్దపీట.. రాష్ట్ర జీడీపీలో 1.5 శాతం వైద్యారోగ్యానికి కేటాయింపు
►23 జిల్లా ప్రధాన కేంద్రాల్లో మెడికల్ కాలేజీ-కమ్- సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు
►డాక్టర్, నర్సులు, పారామెడిక్స్ సీట్లు రెట్టింపు
►యువత స్వయం ఉపాధి పొందేలా అనేక పథకాలు.. 4 శాతం వడ్డీరేటుతో రూ. 10 లక్షల లిమిట్ క్రెడిట్ కార్డు
►విద్యారంగానికి రాష్ట్ర జీడీపీలో 4 శాతం కేటాయింపు
►నెలనెలా ఇంటి వద్దకే రేషన్.. 1.5 కోట్ల కుటుంబాలకు లబ్ది
►బెంగాల్ ఆవాస్ యోజన కింద తక్కువ రేట్లకే 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం
►క్రిషక్ బంధు పథకం కింద 68 లక్షల మంది చిన్న,సన్నకారు రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున సాయం
►తక్కువ రేట్లకే ఇండ్లకు నిరంతరాయ విద్యుత్ సరఫరా
►46 లక్షల కుటుంబాలకు తాగునీటి సరఫరా
చదవండి: అసెంబ్లీ ఎన్నికల బరిలో బెంగాలీ తారలు
I humbly present my 10 ‘Ongikars’ to build a stronger & more prosperous Bengal so that the wheels of development keep moving forward in the third term of our government. The aim is just one, to sustain Bengal as one of the leading states in the country. (1/4) pic.twitter.com/K0xNtrt7GB
— Mamata Banerjee (@MamataOfficial) March 17, 2021
Comments
Please login to add a commentAdd a comment