సాక్షి, కోలక్‌తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన తరుణంలో బెంగాల్‌లో టీఎంసీకి వరుస ఎదురు దెబ్బలు తగులున్నాయి. బీజేపీలోకి జంప్ అవుతున్న నాయకులు సంఖ్య వేగం పుంజుకుంటోంది. తాజాగా మాజీ ఎంపీ దినేష్ త్రివేది, ఎమ్మెల్యే సోనాలీ గుహ బీజేపీలో చేరారు. దీంతో రాజకీయ సెగ రగులుకుంది. సీఎం మమతా బెనర్జీ తనపార్టీ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఈ పరిమాణాలు ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు గత 20 ఏళ్లుగా పార్టీలో ఉంటున్నా పాతవారికి ప్రాధాన్యత లేదంటూ అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. (సమరానికి సై : దీదీ సంచలనం)
మాజీఎంపీ దినేష్ త్రివేదీ, ఎమ్మెల్యే సోనాలీ గుహ గుడ్‌బై
ఇప్పటికే టీఎంసీ ఎంపీ పదవికి రాజీనామా చేసిన దినేష్ త్రివేది తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సమక్షంలో త్రివేది కాషాయ కండువా కప్పుకున్నారు. త్రివేది చేరికను స్వాగతించిన నడ్డా, ఆయన ఇప్పుడు సరైన పార్టీలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అటు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బంగారు క్షణాలివే అంటూ త్రివేది పేర్కొన్నారు. తాను బరిలో ఉన్నా లేకున్నాఎన్నికల ప్రక్రియలో చురుకుగా ఉంటాను. బెంగాల్ ప్రజలు పురోగతిని కోరకుంటారు. అవినీతిని, హింసనుకూడా టీఎంసీనీ తిరస్కరించనున్నారంటూ ఘాటుగా స్పందించారు.
టీఎంసీలో ఉండేది లేదు :అసంతృప్తనేత దినేష్ బజాజ్
దీనికి తోడు మరో నేత దినేష్ బజాజ్ కూడా దీదీపై అసంతృప్తితో రగలిపోతున్నారు. ఈనేపథ్యంలోనే తాను టీఎంసీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీదీతో 20 ఏళ్లుగా ఉన్నాను. కొత్తవారికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే వారు పాతవారిని విస్మరించకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చిస్తున్నానని వెల్లడించారు. బీజేపీ టికెట్ వస్తుందా లేదా అన్నది తనకు పట్టింపు లేదనీ, కానీ ఇకపై పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నానంటూ పేర్కొన్నారు
కాగా ఫిబ్రవరి 12 న, మాజీ కేంద్ర రైల్వే మంత్రి బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ టీఎంసీ పార్టీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రోజురోజుకు క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితులు తననుఉక్కిరాడకుండా చేస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పటికే టీఎంసీనేత సువేందు అధికారి, అటవీ శాఖా మంత్రి రాజీబ్ బెనర్జీ వంటి పలువురు కీలకనేతలు మమతా బెనర్జీకి షాక్ ఇస్తూ బీజేపీలో చేరారు. నందిగ్రామ్ నుంచే పోటీచేస్తానన్న మమతా బెనర్జీ , బయటివారికి చోటు లేదన్న వ్యాఖ్యలపై సువేందు అధికారి స్పందించారు. నందిగ్రామ్ బరిలో విజేత ఎవరో మే 2 న తేలుతుందంటూ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment