కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో అర్జున్‌ భేటీ | Actor Arjun Meets Kishan Reddy Ahead Tamilnadu Assembly Polls | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో అర్జున్‌ భేటీ

Published Wed, Mar 10 2021 7:56 AM | Last Updated on Wed, Mar 10 2021 12:15 PM

Actor Arjun Meets Kishan Reddy Ahead Tamilnadu Assembly Polls - Sakshi

సాక్షి, చెన్నై: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ కిషన్‌రెడ్డితో నటుడు అర్జున్‌ భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జోరందుకుంది. చెన్నైలో తిష్ట వేసి ఎన్నికల వ్యూహాలకు కిషన్‌రెడ్డి పదును పెట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షుడు ఎల్‌ మురుగన్, కిషన్‌రెడ్డిలను అర్జున్‌ మంగళవారం కలవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

కొంత సేపు వీరి మధ్య పలు అంశాలపై చర్చ సాగిన సమాచారంతో అర్జున్‌ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ పలకరింపు మర్యాద పూర్వకమేనని, కిషన్‌రెడ్డి తనకు సన్నిహితుడు కావడంతోనే ఆయన్ను కలిసినట్టుగా అర్జున్‌ పేర్కొన్నారు.



చదవండి: అన్నాడీఎంకే- బీజేపీ కూటమి నుంచి మిత్రపక్షం అవుట్‌‌‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement