ముంబై: పశ్చిమ బెంగాల్‌లో మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దేశవాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, టీఎంసీ మళ్లీ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో బెంగాల్ ఎన్నికల్లో పోటీచేసే విషయంపై శివసేవ పార్టీ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘దేశ వ్యాప్తంగా బెంగాల్‌లో శివసేన పోటీచేస్తుందా?లేదా? ఆసక్తి నెలకొంది. ఈ రోజు పార్టీ అధ్యక్షుడు, సీఎం ఉద్దవ్ ఠాక్రేతో చర్చలు జరిపాం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ‘దీదీ వర్సెస్ అన్ని పార్టీలు’ అన్న రీతీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తాము మమతాబెనర్జీకి మద్దతుగా నిలబడటం కోసం బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. ఎందుకంటే ఆమె నిజమైన బెంగాల్ సివంగి అని సంజయ్ రౌత్ ట్విటర్‌లో పేర్కొన్నారు. బెంగాల్‌లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ. ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.
— Sanjay Raut (@rautsanjay61) March 4, 2021
Comments
Please login to add a commentAdd a comment