కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికార బీజేపీ, ప్రధాని∙మోదీపై సమరభేరి మోగించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటించారు. రాకేష్ తికాయత్, యుధ్‌వీర్ సింగ్ (భారతీయ యూనియన్) నేతృత్వంలో బుధవారం తనను కలుసుకున్న రైతు నాయకులతో మమత చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధరని కొనసాగించాలనే డికిసాన్‌మాండ్లతో గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న రైతన్నలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
భేటీ తర్వాత తికాయత్ మీడియాతో మాట్లాడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి ఓటు వేయొద్దని విస్తృతంగా ప్రచారం నిర్వహించిన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్, ఇతర రైతు నాయకులు వచ్చే ఏడాది యూపీ సహా అయిదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే ప్రచారాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ‘మేము ప్రకృతి విపత్తులతో పాటు రాజకీయ విపత్తుల్ని ఎదుర్కొంటున్నాం’’ అని మమత అన్నారు. రైతన్నలకు మద్దతుగా బీజేపీయేతర రాష్ట్రాలన్నీ ఏకం కావాలంటూ ఆమె విపక్షాలకు పిలుపునిచ్చారు.
చర్చలకు సిద్ధం: తోమర్
రైతులతో చర్చల్ని పునరుద్ధరించడానికి తాము సిద్ధంగా ఉన్నామనివ్యవసాయ మంత్రి తోమర్ చెప్పారు. అయితే వ్యవసాయ చట్టాల్లో ఉన్న అభ్యంతరకర అంశాలను సహేతుకంగా చెప్పాలని రైతులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment