
రాష్ట్రాలకు ఎలాంటి లాభం లేదు: సీఎం
కోల్కతా: కేంద్రం పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్రం చేస్తున్న మార్పులు సమస్యకు పరిష్కారం కాదని మండిపడ్డారు. కేంద్రం నిర్ణయంతో సమాజంలో చాలా వర్గాలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. వ్యవసాయ దారులకు, సహకార రంగానికి, అసంఘటిత రంగానికి నోట్ల రద్దు వల్ల ఎలాంటి ఊరట లభించలేదన్నారు.
పాత రూ. 500 నోటు వినియోగం కేంద్రానికే ఉపయోగకరమని సూచించారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రాలకు ఎలాంటి లాభం లేదని మమతా తెలిపారు.