కోల్‌కత్తా: దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. రేపు(శుక్రవారం) ఉద్దవ్ థాక్రే, శరద్ పవార్‌ను ముంబై కలవనున్నట్టు ఆమె చెప్పారు. వీలైతే అఖిలేష్ యాదవ్‌ను కూడా కలిసే ఛాన్స్ ఉందన్నారు.
కాగా, సీఎం మమతా బెనర్జీ గురువారం మాట్లాడుతూ.. వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు వివాహం కోసం నేను ముంబై వెళ్తున్నాను. ఇదే సమయంలో రేపు(శుక్రవారం) శివసేన నేత ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశం కాబోతున్నాను. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై చర్చించబోతున్నాము. లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటిసారిగా మేము భేటీ అవుతున్నాము. రేపటి భేటీకి అఖిలేష్ యాదవ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పుకొచ్చారు.
Kolkata | West Bengal CM Mamata Banerjee says, "I am going to Mumbai for the wedding of Mukesh Ambani's son. Tomorrow I have an appointment with Uddhav Thackeray. I will also meet Sharad Pawar there. There will be political discussion as we will meet after (Lok Sabha) elections.… pic.twitter.com/vpCd4I0Wkd
— ANI (@ANI) July 11, 2024
ఇదిలా ఉండగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీ నేతలతో భేటీ కావడం నేపథ్యంలో ప్రాధాన్యత చోటుచేసుకుంది. వీరి సమావేశంలో ఏం చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment