ఫలించిన ‘దీదీ’ సెంటిమెంట్‌.. మమత ఇంటికి డాక్టర్లు | Kolkata Junior Doctors Arrive At CM Mamata Banerjee Residence | Sakshi
Sakshi News home page

ఫలించిన ‘దీదీ’ సెంటిమెంట్‌.. మమత ఇంటికి డాక్టర్లు

Published Sat, Sep 14 2024 7:41 PM | Last Updated on Sat, Sep 14 2024 8:16 PM

Kolkata Junior Doctors Arrive At CM Mamata Banerjee Residence

కోల్‌కతా: బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ, జూనియర్‌ డాక్టర్ల చర్చల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు సీఎం మమతా బెనర్జీతో చర్చలకు అంగీకరించారు. ఈ క్రమంలో జూడాల బృందంలో మమతతో చర్చించేందుకు కాసేపటి క్రితమే ఆమె ఇంటికి వెళ్లారు.

కాగా, సీఎం మమతా శనివారం అనూహ్యంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్న ప్రదేశానికి వెళ్లారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడారు. తమకు న్యాయం కావాలి అనే నినాదాల మధ్య వైద్యులను ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగించారు. ఈ క్రమంలో దీదీ..‘నేను ముక్కమంత్రిగా కాకుండా మీ సోదరిగా ఇక్కడికి వచ్చాను. నా పదవి పెద్దది కాదు, ప్రజలు పెద్దవారు. నిన్న మీరింతా ఈ భారీ వర్షంలో నిరసన వ్యక్తం చేసినందుకు, నేను కూడా నిద్రపోలేదు. దయచేసి మీ డిమాండ్లను నెరవేరస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను అని అన్నారు. ఇదే సమయంలో వైద్యులతో మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల రోగుల సంక్షేమ కమిటీలను తక్షణమే రద్దు చేసినట్లు బెనర్జీ ప్రకటించారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇది నా చివరి ప్రయత్నం అని అన్నారు.

 

 

అనంతరం, కొద్ది గంటల వ్యవధిలోనే  సీఎం మమతా బెనర్జీతో చర్చలకు సిద్ధమేనని వైద్యులు ప్రభుత్వానికి మెయిల్‌ పంపించారు. వైద్యుల మెయిల్‌కు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధి డాక్టర్ మనోజ్ పండిట్ స్పందించారు. అనంతరం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలో సాయంత్రం ఆరు గంటలకు ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను ఆహ్వానించారు. దీంతో, మమతతో చర్చించేందుకు వైద్యులు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో వీరి సమావేశంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. డాక్టర్ల డిమాండ్లను దీదీ ఒప్పుకుంటారా? లేదా? అనే సస్పెన్స్‌ నెలకొంది. 
 

ఇది కూడా చదవండి: భరతమాత బిడ్డకు విదేశీగడ్డపై అవమానం: ప్రధాని మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement