
సాక్షి, న్యూఢిల్లీ : పొరపాటు పడడం ఎవరికైనా సహజమే. సాధారణ పౌరులు పొరపాటు పడితే ఎవరూ పట్టించుకోరు. అదే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి వారు పొరపాటు పడితే ట్విట్టర్‌లో పెద్దది చేసి చూస్తారు. నవ్వుతారు, నవ్విస్తారు. ఆమె విషయంలో అదే జరిగింది.
మమతా బెనర్జీ బుధవారం నాడు ఓ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించేందుకు వెళ్లారు. అక్కడ వేదికనెక్కారు. మాట్లాడుదామని పక్కనున్న ఓ వ్యక్తి చేతిలోని మైక్రోఫోన్‌ను లాక్కొని మూతివద్ద పెట్టుకున్నారు. ఒక్కసారిగా ముఖం మీద వెలుగు పడడంతో అది మైక్రోఫోన్ కాదని, టార్చిలైట్ అని గ్రహించారు. వెంటనే టార్చిలైట్‌ను వెనక్కి ఇచ్చేసి మైక్రోఫోన్ అందుకొని ఉపన్యాసాన్ని అందుకున్నారు. ర్యాలీలో ఎంత మంది ఈ విషయాన్ని గ్రహించారో, ఇంత మంది దీన్ని చూసి నవ్వుకున్నారో తెలియదు. ఇప్పుడు ఈ వీడియో క్లిప్పింగ్‌ను ట్విట్టర్‌లో పెట్టి నవ్విస్తున్నారు. 'మీకు 'మిడాస్ టచ్' ఉంది. ఆ శక్తితో టార్చిలైట్‌ను మైక్రోఫోన్‌గా మార్చేయండి' అంటూ ఒకరు.... ఏదో సందర్భంలో మైక్‌టైసన్ పగులబడి నవ్వుతున్న వీడియో ముక్కను తీసుకొని, మమతా పొరపాటును చూసి నవ్వుతున్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. మిడాస్ టచ్ అంటే దేన్నైనా బంగారంగా మార్చే మాయాజాలాన్ని మిడాస్ టచ్‌గా గ్రీక్‌లో పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment