‘తృణమూల్‌ను విమర్శిస్తే కళ్లు పీకేస్తా’ | Abhishek comments to make controversies | Sakshi
Sakshi News home page

‘తృణమూల్‌ను విమర్శిస్తే కళ్లు పీకేస్తా’

Published Wed, Jun 24 2015 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM

Abhishek comments to make controversies

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వాళ్ల కళ్లు పీకేస్తానని, చేతులు నరికేస్తానని సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బహిరంగంగా బెదిరించడం వివాదాస్పదంగా మారింది. గత సోమవారం పశ్చిమబెంగాల్ లోని బసీర్హాట్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్నాయి.

బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు తృణమూల్ తీరుకు అద్దం పడుతున్నాయని, ఆ పార్టీ డీఎన్‌ఏలోనే దౌర్జన్యాలకు పాల్పడడం ఉందన్నారు.  సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మాట్లాడుతూ తాను అభిషేక్ హింసాత్మక వ్యాఖ్యలతో ఆశ్చర్యపోలేదని, తృణమూల్ అనుసరించే విధానం అలాంటిదేనని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement