‘తృణమూల్‌ను విమర్శిస్తే కళ్లు పీకేస్తా’
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వాళ్ల కళ్లు పీకేస్తానని, చేతులు నరికేస్తానని సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బహిరంగంగా బెదిరించడం వివాదాస్పదంగా మారింది. గత సోమవారం పశ్చిమబెంగాల్ లోని బసీర్హాట్లో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్నాయి.
బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు తృణమూల్ తీరుకు అద్దం పడుతున్నాయని, ఆ పార్టీ డీఎన్ఏలోనే దౌర్జన్యాలకు పాల్పడడం ఉందన్నారు. సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మాట్లాడుతూ తాను అభిషేక్ హింసాత్మక వ్యాఖ్యలతో ఆశ్చర్యపోలేదని, తృణమూల్ అనుసరించే విధానం అలాంటిదేనని అన్నారు.