
ఒబామాను మోడీ కాపీ కొడుతున్నారు!
చండీగఢ్:అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను భారత ప్రధాని నరేంద్ర మోడీ కాపీ కొడుతున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ముచ్చటించనున్ననరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను గుడ్డిగా అనుకరించేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్‌సింగ్ విమర్శించారు. ఒబామా 2009, సెప్టెంబర్ 8న అమెరికా విద్యార్థులనుద్దేశిమంచి మాట్లాడారని, ఆయన చేసిన ప్రతిదాన్నీ కాపీకొట్టేందుకు మోడీ యత్నిస్తున్నారని ఆరోపించారు.
టీచర్స్ డే రోజున(సెప్టెంబర్ 5) ప్రధాని మోడీ ఉపాధ్యాయులను ఉద్దేశించి కాకుండా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడనుండటం వింతగా ఉందని ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. అన్ని అధికారాలూ అధ్యక్షుడి చేతిలో ఉండే అమెరికాలో మాదిరిగా మోడీ కూడా ప్రధానిలా కాకుండా అధ్యక్షుడిలా సర్వాధికారాలను చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.