Akhil Agent Looks Have Copy Allegations: అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులు మనాలీలో జరుగుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు అఖిల్. మంచు పర్వతాల్లో మొహం నిండా గాయాలతో ఉన్న ఫొటోలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే భారీ యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ లుక్ కాపీ కొట్టారని చర్చ నడుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో పర్వతాలు, గిరజాల జుట్టు, పోనీటైల్‌తో స్టైలిష్‌గా ఉన్న అఖిల్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టీవీ సిరీస్‌లోని హీరో జాన్ స్నో (కిట్ హరింగ్టన్)ను గుర్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ సిరీస్‌లో తరహాలోనే 'ఏజెంట్' మూవీలో అఖిల్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఊల్ కోట్ ధరించి కనిపిస్తున్నాడు. చిన్నపాటి మార్పు తప్ప ఇద్దరి గెటప్పులో పెద్ద చేంజ్ లేదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే 'ఏజెంట్' చిత్రం హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ 'బోర్న్' ఆధారంగా తెరకెక్కనుంది. ఈ క్రమంలో మరో హాలీవుడ్ సిరీస్‌లోని హీరోను కాపీ కొట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరీ ఇది కోఇన్స్‌డెంట్‌గా జరిగిందా, లేక కావాలని చేసిందా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే కండలు పెంచిన అఖిల్‌కు కొంచెం కిట్ హరింగ్టన్ పోలికలు ఉన్నాయని ఇటీవల సోషల్ మీడియాలో టాక్ నడిచింది.
చదవండి: ఇంటర్వ్యూలో యాంకర్ గొడవ.. ఏడ్చేసిన కృతి శెట్టి
Comments
Please login to add a commentAdd a comment