మరోసారి పోలీస్ గెటప్లో మాస్ మహరాజ్ | Ravi Teja Upcoming Movie Details | Sakshi
Sakshi News home page

మరోసారి పోలీస్ గెటప్లో మాస్ మహరాజ్

Published Thu, Jul 28 2016 12:55 PM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM

మరోసారి పోలీస్ గెటప్లో మాస్ మహరాజ్ - Sakshi

మరోసారి పోలీస్ గెటప్లో మాస్ మహరాజ్

మాస్ మహరాజ్ రవితేజ మేకప్ వేసుకొని నెలలు గడిపోతుంది. బెంగాళ్ టైగర్ సినిమాతో మంచి విజయం సాధించినా.. తరువాత సినిమా ఎంపికలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు ఈ మాస్ హీరో. మూడు ప్రాజెక్ట్లు ప్రారంభమైనట్టే అనిపించినా... అవి వెనక్కి వెళ్లిపోయాయి. తాజాగా మరో సినిమాను రవితేజ కన్ఫామ్ చేశాడన్న వార్త వినిపిస్తోంది.

రేసుగుర్రం లాంటి సూపర్ హిట్ సినిమాకు స్క్రీన్ప్లే అందించిన విక్రమ్ సిరి దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయనున్నాడు రవితేజ. ఈ సినిమాలో తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే విక్రమార్కుడు, పవర్ సినిమాల్లో పోలీస్ గెటప్లో అదరగొట్టిన  రవితేజ, ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో అలరించనున్నాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement