లక్కీచాన్స్ కొట్టిన విజయలక్ష్మి | Vijayalakshmi to make a comeback in Chennai 600028 sequel | Sakshi
Sakshi News home page

లక్కీచాన్స్ కొట్టిన విజయలక్ష్మి

Published Thu, Mar 17 2016 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

లక్కీచాన్స్ కొట్టిన విజయలక్ష్మి

లక్కీచాన్స్ కొట్టిన విజయలక్ష్మి

 ఒక్కోసారి ఊహించనివి జరిగి థ్రిల్ చేస్తాయి. నటి విజయలక్ష్మీ విషయంలోనూ అలాంటిదే జరిగింది. ఇటీవలే నిర్మాతగా మారారు. అంతేకాదు ఆ దర్శకుడు ఫిరోజ్‌ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. వివాహానంతరం తన నటన కొనసాగుతుందని ప్రకటించిన విజయలక్ష్మికి వెంటనే నటించే అవకాశం తలుపు తట్టింది. ఇది సంతోషకరమైన విషయం అనుకుంటే మరో థ్రిలింగ్ అంశం ఆమె హీరోయిన్‌గా పరిచయం అయిన చిత్రానికి సీక్వెల్‌లోనే నటించే అవకాశం రావడం. నటి విజయలక్ష్మి దర్శకుడు అగస్థ్యిన్ కూతురన్న విషయం తెలిసిందే.
 
 ఈమె ఎన్నై-28 చిత్రం ద్వారా రంగప్రవేశం చేశారు. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ రూపొందించడానికి వెంకట్‌ప్రభు సిద్ధమయ్యారు. ఇందులోనూ చెన్నై-28లో నటించిన జయ్, శివ, విజయలక్ష్మి, ప్రేమ్‌జీ, నితిన్ సత్యలను నటింపజేయాలని ఆయన భావించారు. ఇప్పుడు వారితోనే చెన్నై-28 రెండవ భాగాన్ని తెరకెక్కించనున్నారు. చెన్నై-28 చిత్రం 2007లో విడుదలైంది.తొమ్మిదేళ్ల తరువాత దానికి సీక్వెల్ తెరకెక్కనుండడం గమనార్హం. ఈ చిత్రం మే నెల చివరి వారంలో సెట్‌పైకి రానుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement