సాక్షి ప్రతిని«ధి, చెన్నై: కోట్లాది రూపాయల మేర పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై తమిళ హీరో విజయ్, ఏజీఎస్ నిర్మాణ సంస్థ అధినేత, సినీ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బుసెళియన్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపుపన్ను శాఖ అధికారులు బుధవారం చేసిన సోదాలు గురువారం కొనసాగాయి. అన్బుఇల్లు, ఆఫీస్‌లో రూ.77 కోట్ల నగదు, రూ.24 కోట్ల విలువైన కిలో వజ్రాలు, బంగారం, విజయ్, అన్బుసెళియన్‌ల వద్ద ఉన్న రూ.300 కోట్ల విలువైన స్థిరాస్తిపత్రాలు లభించాయని సమాచారం. రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఐటీ విభాగం అంచనా వేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment